ONGC RELEASED NOTIFICATION FOR 313 VACANCIES CHECK ELIGIBILITY DETAILS HERE EVK
ONGC Recruitment 2021: ఓఎన్జీసీలో 313 ఉద్యోగాలు .. అర్హతలు ఇవే
(ఫ్రతీకాత్మక చిత్రం)
ONGC Jobs 2021 | ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా మెకానికల్, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 313 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 313 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు సెప్టెంబర్ 22, 2021 నుంచి అక్టోబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపుం ఉంది. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల గేట్ (GATE) స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, అర్హతల వివరాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్ సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home+ ను సందర్శించ్చు.
సంబంధిత సబ్జెక్టులలో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, డిగ్రీ చేసి ఉండాలి. గేట్ స్కోర్ తప్పని సరి
వయో పరిమితి
30 ఏళ్లు మించి ఉండరాదు
ఎంపిక విధానం.. దరఖాస్తు ప్రక్రియ
- గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ముందుగా అభ్యర్థులు www.ongcindia.com వెబ్ సైట్ ను సందర్శించాలి.
- నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి. అనంతరం దరఖాస్తుచేసుకోవాలి.
- అనంతరం ఆన్ లైన్ అప్లికేషన్ కోసం https://recruitment.ongc.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- దరఖాస్తులో మీ పూర్తి సమాచారం అందించాలి.
- దరఖాస్తు అనంతరం మీ అప్లికేషన్ హార్డు కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.