ONGC Recruitment 2022 | ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి లా విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం ఓఎన్జీసీ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022 LLM స్కోర్ల ఆధారంగా ఈ జాబ్ ఆఫర్ చేయనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి లా విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం ఓఎన్జీసీ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022 LLM స్కోర్ల ఆధారంగా ఈ జాబ్ ఆఫర్ చేయనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. 2022 CLATల మార్కులు తప్ప మిగతా సంవత్సరాల CLAT LLM స్కోరు చెల్లదని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న క్యాండిడేట్స్ ఫారమ్‌లు విడుదలైన తర్వాత ongcindia.com లోని అధికారిక పోర్టల్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్లాట్ 2022 ఎల్ఎల్ఎం ఎగ్జామ్ త్వరలోనే జరగనుంది.
“CLAT-2022 పరీక్షకు హాజరైన అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడానికి ONGC మరొక ప్రకటనను ప్రచురించనుంది. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కచ్చితమైన తేదీని కొద్ది రోజుల్లో ONGC (www.ongcindia.com) వెబ్సైట్లో నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాం. అప్డేట్లను పొందడానికి అభ్యర్థులు క్రమం తప్పకుండా www.ongcindia.comని విజిట్ చేయాల్సి ఉంటుంది" అని ఓఎన్జీసీ అధికారిక నోటీసు వెల్లడించింది.
ONGC Recruitment 2022 : వేకెన్సీ డీటెయిల్స్
అన్రిజర్వ్డ్ కేటగిరీ (Unreserved Category) అభ్యర్థులకు రెండు అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టులు ఆఫర్ చేస్తోంది ఓఎన్జీసీ. అలాగే SC, EWS కేటగిరీ అభ్యర్థులకు కోసం ఒకటి చొప్పున పోస్టులు ఉన్నాయి.
ONGC Recruitment 2022 : : ఎలిజిబిలిటీ క్రైటీరియా
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: అభ్యర్థులు లా (ప్రొఫెషనల్)లో గ్రాడ్యుయేట్ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. క్వాలిఫైయింగ్ కోర్సులో చివరి సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు తప్పనిసరిగా జూలై 31న లేదా అంతకన్నా ముందు కనీసం 60 శాతం మార్కులతో మార్క్‌షీట్ (Mark Sheet), కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. 3 ఏళ్ల అనుభవం ఉండి అడ్వకేట్‌ను ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని అధికారిక నోటీసు పేర్కొంది.
ONGC Recruitment 2022 : సెలక్షన్ ప్రాసెస్
ONGC మేనేజ్మెంట్ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన అభ్యర్థులను వారి CLAT 2022 LLM స్కోర్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
యూనివర్సిటీ నిబంధనల ప్రకారం క్వాలిఫైయింగ్ డిగ్రీలో మార్కుల శాతం లెక్కింపు ఉంటుంది. “ఎక్కడైనా CGPA/ OGPA/ CPI/ DGPA లేదా డిగ్రీలో లెటర్ గ్రేడ్ ఇచ్చినా.. సంబంధిత యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ ఆమోదించిన నిబంధనల ప్రకారం సమానమైన % మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. CGPA/ OGPA/ CPI/ DGPA లేదా లెటర్ గ్రేడ్‌ను శాతంగా మార్చడానికి యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు సదుపాయం లేకుంటే, అభ్యర్థి సంబంధిత గ్రేడ్‌ను గరిష్టంగా సంబంధిత స్కేల్‌తో విభజించి, ఫలితాన్ని 100తో గుణించడం ద్వారా స్కోరు శాతం ఎంతో తెలుస్తుంది" అని ఓఎన్జీసీ తెలిపింది.
ONGC Recruitment 2022 : శాలరీ
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏడాదికి మూడు శాతం పెంపుతో రూ.60,000 - రూ.1,80,000 వరకు శాలరీ పొందుతారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.