Home /News /jobs /

ONGC RECRUITMENT 2022 CONTRACT JOBS IN ONGC RAJAHMUNDRY UNIT SALARY KNOW APPLICATION PROCESS DETAILS EVK

ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ రాజ‌మండ్రి యూనిట్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ONGC Recruitment 2022 | ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది . రాజమండ్రి యూనిట్లో  పలు  ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది . రాజమండ్రి యూనిట్లో  పలు  ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.  ఈ ఉద్యోగాలను  కాంట్రాక్టు ప్రాతిపదికన ఉండనున్నాయి. మొత్తం 33  ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.  ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ (Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    IBPS RRB: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. డిగ్రీ అర్హ‌త‌తో 8,106 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ వివ‌రాలు



    పోస్టుల వివ‌రాలు..





























    పోస్టు పేరుఖాళీలువేతనం
    మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్ డ్యూటీ30రూ. 1,05,000/-
    మెడికల్ ఆఫీసర్ ఆక్యుపేషన్ హెల్త్01రూ.  1,00,000/-
    మెడికల్ ఆఫీసర్ డ్యూటీ01రూ.  1,00,000/-
    మెడికల్ ఆఫీసర్ డ్యూటీ01రూ. 50,000/-

    అర్హ‌త‌లు..
    బ్యాచిల‌ర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిల‌ర్ ఆఫ్ స‌ర్జ‌రీ (ఎంబీబీఎస్‌) ఉత్తీర్ణత

    JEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అనంత‌రం ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.
    - మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను తుది ఎంపిక చేస్తారు.

    దర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home/ ను సంద‌ర్శించారు.

    Step 3 - కెరీర్ పోర్ట‌ల్‌లోకి వెళ్లి 2022 నోటిఫికేష‌న్‌లు చూడాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.

    SSC Recruitment 2022: 2,065 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే చాన్స్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

    Step 5 - త‌రువాత నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న‌ట్టు ద‌ర‌ఖాస్తు పూర్తిచేయాలి.

    Step 6 - అప్లికేష‌న్‌ను భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

    Step 7 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జూన్ 12, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.



    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Central Government Jobs, Govt Jobs 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు