ONGC RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 922 NON EXECUTIVE VACANCIES HERE FULL DETAILS NS
ONGC Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో ఓఎన్జీసీలో భారీగా జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ www.ongcindia.com ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం career ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 3: అనంతరం apply link ఓపెన్ చేయాలి. Step 4: తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. Step 5: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. Step 6: అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.