Home /News /jobs /

ONGC RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 922 NON EXECUTIVE JOBS VACANCIES HERE FULL DETAILS NS

ONGC Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 లాస్ట్ డేట్.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    ఏ విభాగాల్లో ఖాళీలంటే?
    జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్ వైజర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మెరైన్ రేడియో, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో ONGC పేర్కొంది.
    TS Police Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఎస్ఐ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు రేపే ఆఖ‌రు తేదీ.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

    విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.



    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ www.ongcindia.com ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం career ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం apply link ఓపెన్ చేయాలి.
    Step 4: తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    Step 5: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
    Step 6: అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS, ONGC

    తదుపరి వార్తలు