Home /News /jobs /

ONGC RECRUITMENT 2021 ONLINE APPLICATIONS INVITING FOR 21 NEW VACANCIES NS

ONGC Recruitment 2021: ఎంబీఏ, జర్నలిజం చేసిన వారికి శుభవార్త.. ONGCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఎంబీఏ, జర్నలిజం చేసిన వారికి శుభవార్త.. ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఎంబీఏ, జర్నలిజం చేసిన వారికి శుభవార్త.. ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు (Jobs) జనవరి 4లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై (Job Application) చేసుకునేందుకు జనవరి 4ను అఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 2 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..




















    పోస్టు ఖాళీలు
    హెచ్ ఆర్ ఎగ్జిక్యూటీవ్ (HR Executive)15
    పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (Public Relations Officer)6
    మొత్తం21

    విద్యార్హతల వివరాలు..
    HR Executive: పర్సనల్ మేనేజ్మెంట్/HRD/HRM తదితర విభాగాల్లో 60 శాతం మార్కులతో MBA చేసిన వారు ఈ విభాగంలో ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
    Public Relations Officer: పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ లో 60 శాతం మార్కులతో పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా UGC NET-June 2020 అర్హత సాధించి ఉండాలి.
    Bank of Baroda Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Career విభాగంలో Recruitment Notice ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Recruitment of HR Executive and Public Relations Officer through UGC NET 2020 Score ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం Click here for Registration Link ఆప్షన్ పై క్లిక్ చేయండి
    Step 4: తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.


    అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో రూ. 300ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. EWS, OBC కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS, ONGC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు