ONGC Jobs 2021 | ఓఎన్జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ (Graduate Trainee) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే అవకాశం ఉంది. ఖాళీల వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 313 పోస్టుల్ని ప్రకటించింది. గేట్ 2020 స్కోర్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ ఖాళీలను 2020 మార్చిలో ప్రకటించింది ఓఎన్జీసీ. కానీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. కాబట్టి గేట్ 2020 స్కోర్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. గేట్ 2021 స్కోర్ ఉన్నవారికి వేరుగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని ఓఎన్జీసీ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ONGC Recruitment 2021: ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇవే...
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 22 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 12 దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. వయస్సు- 33 ఏళ్ల లోపు. వేతనం- రూ.60,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,80,000 వేతనం లభిస్తుంది.
Step 4- ఆ తర్వాత New applicants పైన క్లిక్ చేయాలి.
Step 5- గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
Step 7- ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.