Home /News /jobs /

ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్... పరీక్ష లేకుండా జాబ్

ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్... పరీక్ష లేకుండా జాబ్

ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్... పరీక్ష లేకుండా జాబ్
(ప్రతీకాత్మక చిత్రం)

ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో 313 ఉద్యోగాలకు నోటిఫికేషన్... పరీక్ష లేకుండా జాబ్ (ప్రతీకాత్మక చిత్రం)

ONGC Recruitment 2021 | ఓఎన్​జీసీలో 313 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువు త్వరలోనే ముగియనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) 313 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్​ 12 లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని ఓఎన్​జీసీ పేర్కొంది. ఈ పోస్టుల ఎంపిక కోసం ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం గేట్​–2020 స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్​ ద్వారా ఇంజినీరింగ్​, జియో సైన్సెస్​ విభాగాల్లో గ్రాడ్యుయేట్​ ట్రైనీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కొరకు ఓఎన్​జీసీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. అదే వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ONGC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















































































 మొత్తం ఖాళీలు  313
 సిమెంటింగ్​​ మెకానికల్  06
 సిమెంటింగ్ పెట్రోలియం  01
 సివిల్  18
 డ్రిల్లింగ్  28
ఎలక్ట్రికల్  39
 ఎలక్ట్రానిక్స్​  05
 ఇన్​స్ట్రుమెంటేషన్​  32
 మెకానికల్  31
 ప్రొడక్షన్ మెకానికల్  21
 ప్రొడక్షన్​ కెమికల్  16
 ప్రొడక్షన్​ ప్రెట్రోలియం  12
 రిజర్వాయర్  ​07
 కెమిస్ట్  15
 జియాలజిస్ట్  19
 జియోఫిజిస్ట్​(సర్​ఫేస్​)  24
 జియోఫిజిస్ట్​(వెల్స్​)  03
 మెటీరియల్స్​ మేనేజ్​మెంట్​ ఆఫీసర్​  12
 ప్రోగ్రామింగ్​ ఆఫీసర్​  05
 ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసర్  07

APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 151 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

ONGC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 12

విద్యార్హతలు- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తప్పనిసరి. అభ్యర్థులు వ్యాలిడ్​ గేట్–2020​ స్కోర్​ కలిగి ఉండాలి.

వయోపరిమితి- గ్రాడ్యుయేట్​ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్​ అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు మించరాదు.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SBI SO Recruitment 2021: ఎస్‌బీఐలో 606 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

ONGC Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


Step 1- ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.ongcindia.com/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 2- Recruitment of GTs in Engineering & Geoscience disciplines through GATE 2020 score నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- Click here Online application process for recruitment of GTs పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత New applicants పైన క్లిక్ చేయాలి.

Step 5- గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.

Step 7- ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, ONGC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు