Home /News /jobs /

ONGC RECRUITMENT 2020 OIL AND NATURAL GAS CORPORATION LIMITED RELEASED NOTIFICATION FOR 4182 POSTS KNOW VACANCIES IN KAKINADA RAJAHMUNDRY SS

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

ONGC Recruitment 2020 | ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC 4182 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. మొత్తం 4182 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఓఎన్‌జీసీ. దేశంలోని వేర్వేరు సెక్టార్లలో 21 కేంద్రాల్లో ఈ పోస్టులున్నాయి. సదరన్ సెక్టార్‌లో కాకినాడ, రాజమండ్రిలో కూడా ఖాళీలను ప్రకటించింది ఓఎన్‌జీసీ. మొత్తం 4182 పోస్టులుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రిలోనే 366 ఖాళీలున్నాయి. అకౌంటెంట్, అసిస్టెంట్-హెచ్ఆర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆఫరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయిటనెనన్స్, ల్యాబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), లైబ్రరీ అసిస్టెంట్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్, ప్లంబర్, సర్వేయర్, వెల్డర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పోస్టులున్నాయి.

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

    SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

    ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ongcindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు http://www.ongcapprentices.ongc.co.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. ఒక అభ్యర్థి ఒకే సెంటర్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

    ONGC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 4182
    సదరన్ సెక్టార్- 674 (కాకినాడ- 58, రాజమండ్రి- 308)
    నార్తర్న్ సెక్టార్- 228
    ముంబై సెక్టార్- 764
    వెస్టర్న్ సెక్టార్- 1579
    ఈస్టర్న్ సెక్టార్- 716
    సెంట్రల్ సెక్టార్- 221

    CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో 789 పోలీస్ ఉద్యోగాలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

    Railway Course: రైల్వే జాబ్ కోసం ఈ కోర్సులు చేయండి

    ONGC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 29
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 17 సాయంత్రం 6 గంటలు
    ఫలితాలు- 2020 ఆగస్ట్ 24
    విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పాసైనవారు అప్లై చేయొచ్చు. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, ONGC, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు