Home /News /jobs /

ONGC Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

ONGC Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

ONGC Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

ONGC Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

ONGC Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీ యూనిట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీ యూనిట్‌లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 33 ఖాళీలను ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓఎన్‌జీసీ యూనిట్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. 2022 జూన్ 30 వరకు ఈ కాంట్రాక్ట్ పోస్టులుంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ongcindia.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులే అప్లై చేయాలి. నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ ఐడీకి చివరి తేదీలోగా పంపాలి.

    RRB Jobs: రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా? పరీక్షలు ఎప్పుడంటే

    SSC Recruitment 2020: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

    ONGC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 33
    కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ-FMO)- 28
    కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) ఫుల్ టైమ్- 3
    కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) పార్ట్ టైమ్- 1
    కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్-OH)- 1

    UPSC CDS 2021: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో 345 జాబ్స్... హైదరాబాద్‌లో ఖాళీలు

    RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    ONGC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 9
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 21
    విద్యార్హతలు- బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ- MBBS పాస్ కావాలి
    వయస్సు- గరిష్ట వయస్సు పరిమితి లేదు
    దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ- recruitmentrajahmundry@ongc.co.in
    అప్లికేషన్ ఫామ్‌తో పాటు పంపాల్సిన డాక్యుమెంట్స్- రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, టెన్త్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ మార్క్స్ షీట్, సర్టిఫికెట్, పీజీ మార్క్స్ షీట్, సర్టిఫికెట్, అదనపు అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, సర్టిఫికెట్ ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్, అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్స్ స్కాన్ తీసి పంపాలి.
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నేరుగా లేదా వాట్సప్, స్కైప్, జూమ్, గూగుల్ మీట్, వెబెక్స్ లాంటి ఆన్‌ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఉంటుంది.
    వేతనం- కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఫీల్డ్ డ్యూటీ-FMO) పోస్టుకు రూ.75,000, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) ఫుల్ టైమ్ పోస్టుకు రూ.72,000, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ-GDMO) పార్ట్ టైమ్ పోస్టుకు రూ.41,000, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్-OH) పోస్టుకు రూ.72,000.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, ONGC, Rajamundry, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు