ONGC Recruitment 2019 | దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC పలు ఉద్యోగాలకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 107 ఖాళీలున్నాయి. మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఓఎన్జీసీ అధికారిక వెబ్సైట్ ongcindia.com లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూన్ 18 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్
సెక్యూరిటీ ఆఫీసర్: పోస్ట్ గ్రాడ్యుయేషన్
ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్: డిగ్రీతో పాటు ఐసీడబ్ల్యూఏ/సీఏ లేదా ఎంబీఏ-ఫైనాన్స్ లేదా ఐఐఎం నుంచి పీజీడీఎం. 60 శాతం మార్కులతో పాస్ కావాలి
ఏఈఈ ఎన్విరాన్మెంట్: ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్/ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ లేదా ఎంటెక్/ఎంఈ
ఫైర్ ఆఫీసర్: ఫైర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ
ONGC Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2019 మే 29
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 18
ఆఫ్‌లైన్ ఫీజ్ ప్రారంభ తేదీ: 2019 మే 29
ఆఫ్‌లైన్ ఫీజ్ పేమెంట్‌కు చివరి తేదీ: 2019 జూన్ 19
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్: జూలై చివరి వారం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.