ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ పెట్రో అడిషన్స్ లిమిటెడ్-OPaL ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ చేపట్టింది. మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెయింటనెన్స్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ విభాగాల్లో డైరెక్ట్ సెలక్షన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు http://career.opalindia.in వెబ్సైట్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 6 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఎంపికైనవారికి గుజరాత్లోని వడోదరలో పోస్టింగ్ ఉంటుంది. ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ పెట్రో అడిషన్స్ లిమిటెడ్-OPaL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ONGC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 21
మెకానికల్ మెయింటనెన్స్- 1
ఇన్స్ట్రుమెటేషన్ మెయింటనెన్స్- 1
ఎలక్ట్రికల్ మెయింటనెన్స్- 1
మెటీరియల్స్ మేనేజ్మెంట్- 2
మార్కెటింగ్- 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 6
విద్యార్హత- సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ
వేతనం- రూ.6 లక్షల నుంచి రూ.40 లక్షల వార్షిక వేతనం
వయస్సు- మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెయింటనెన్స్ పోస్టులకు 28 ఏళ్ల లోపు, మెటీరియల్స్ మేనేజ్మెంట్ పోస్టులకు 52 ఏళ్లు, మార్కెటింగ్ పోస్టులకు 28 నుంచి 48 ఏళ్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.