Jobs: ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

ONGC OMPL Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 18 చివరి తేదీ. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ www.ompl.co.in ఓపెన్ చేసి చూడొచ్చు.

  • Share this:
    ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC అనుబంధ సంస్థ అయిన మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్-OMPL, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్-MRPL ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇంజనీర్, ఎగ్జిక్యూటీవ్ (ఈ1 గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. గేట్ 2019 స్కోర్ ద్వారా ఉద్యోగుల్ని నియమించనుంది. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు రాతపరీక్ష ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 18 చివరి తేదీ. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ www.ompl.co.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

    ONGC OMPL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 22
    కెమికల్- 9
    మెకానికల్- 1
    ఎలక్ట్రికల్- 2
    ఇన్‌స్ట్రుమెంటేషన్- 3
    ఐటీ- 1
    ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ)- 2
    ఎగ్జిక్యూటీవ్ (ఫైనాన్స్)- 4

    ONGC OMPL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 19
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 18
    విద్యార్హత- ఇంజనీర్ పోస్టుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ. ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు సీఏ / ఐసీ డబ్ల్యూఏ / ఎంబీఏ ఫైనాన్స్
    మొదటి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    రెండో నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Realme X2: రియల్‌మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి జనవరిలో గుడ్ న్యూస్

    ISRO Jobs 2019: మరో 63 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఇస్రో

    Railway Jobs: రైల్వేలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
    Published by:Santhosh Kumar S
    First published: