హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు ఏడాది... పరీక్ష ఎప్పుడంటే

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు ఏడాది... పరీక్ష ఎప్పుడంటే

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు ఏడాది... పరీక్ష ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు ఏడాది... పరీక్ష ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC updates | మీరు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేశారా? అడ్మిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌ వచ్చి సరిగ్గా ఏడాదవుతుంది.

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాదవుతోంది. 35,000 పైగా ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీ కోసం 2019 ఫిబ్రవరి 28న ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై మార్చి 31న అప్లికేషన్ ప్రాసెస్ ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పరీక్షకు సంబంధించిన సమాచారం లేదు. 2019 అక్టోబర్‌ 15న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు సంబంధించి అధికారికంగా ఓ నోటీసు వచ్చింది. "2019 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రివైజ్డ్ షెడ్యూల్‌ను అన్ని ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లల్లో తర్వాత అప్‌లోడ్ చేస్తాం. అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్స్‌ను ఫాలో కావాలి" అన్నది ఆ నోటీసు సారాంశం. ఈ నోటీసు తప్ప అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు.

  RRB NTPC notification, RRB NTPC CBT 1 admit card, RRB NTPC CBT 1 Updates, RRB NTPC CBT 1 hall ticket, RRB NTPC news, Railway Recruitment Board jobs, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 హాల్ టికెట్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్
  ప్రతీకాత్మక చిత్రం

  ఆర్ఆర్‌బీ గతేడాది రిలీజ్ చేసిన ఇతర నోటిఫికేషన్లకు పరీక్షలు జరగడంతో పాటు నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చింది. కానీ... 35,000 పైగా పోస్టులు ఉన్న ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు సంబంధించిన మొదటి దశ పరీక్ష సీబీటీ-1 ఇప్పటివరకు జరగలేదు. అంటే ఏడాదిగా ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి కదలిక లేదు. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు కోటి మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 1,26,30,885 దరఖాస్తులు వచ్చాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే కోటి పాతిక లక్షల మందికి పైగా అభ్యర్థులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్' అంటూ ఓ నోటీస్ వైరల్‌గా మారడం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తోంది.

  RRB NTPC notification, RRB NTPC CBT 1 admit card, RRB NTPC CBT 1 Updates, RRB NTPC CBT 1 hall ticket, RRB NTPC news, Railway Recruitment Board jobs, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 హాల్ టికెట్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్
  ప్రతీకాత్మక చిత్రం

  ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రభుత్వ శాఖల్లో నాన్-గెజిటెడ్ పోస్టులన్నింటికీ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుందన్నారు. గ్రూప్ బీ, గ్రూప్ సీ, గ్రూప్ డీ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తే ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు-RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నిర్వహించే పలు పరీక్షలు ఉండవన్న వాదన వినిపిస్తోంది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 నిర్వహించే బాధ్యతను నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇదంతా జరగాలంటే ఇంకాస్త సమయం పట్టొచ్చు.

  RRB NTPC notification, RRB NTPC CBT 1 admit card, RRB NTPC CBT 1 Updates, RRB NTPC CBT 1 hall ticket, RRB NTPC news, Railway Recruitment Board jobs, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 హాల్ టికెట్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 అడ్మిట్ కార్డ్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్
  ప్రతీకాత్మక చిత్రం

  భారతీయ రైల్వేలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ పోస్టుల్ని ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

  Telangana Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి తెలంగాణలో 1466 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

  Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

  ఉత్తమ కథలు