Home /News /jobs /

ONE EXAM FOR 7 UNIVERSITIES PG ENTRANCE COURSE CHECK HERE RA

CPGET Notification : 7 వర్సిటీలకు ఒకటే ఎంట్రెన్స్ టెస్ట్.. నోటిఫికేషన్ రిలీజ్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ యూనిర్సిటీలతో పాటు జేఎన్టీయూహెచ్‌లోని ఎమ్మెస్సీ కోర్సులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరవేశాలకు ఒకటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

    దేశంలోనే తొలిసారిగా 7 వర్సిటల్లో పీజీ కోర్సులకు ఒకటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. వచ్చేవిద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలకు గాను ఈ ఎగ్జామ్ జరుగనుంది. ప్రతీ సంవత్సరం ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్ వేర్వేరు ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించేవి. కానీ, ఈ సారి నుంచి ఇలా కాకుండా ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ) ఉంటుంది. నిర్వహణ బాధ్యత ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ చసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా విడుదలైంది.

    సంప్రదాయ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఓయూ, కేయూ, జేఎన్టీయూహెచ్ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుందని తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకొచ్చామన్నారు. ఇప్పటివరకు ఆర్థికంగా బలహీనవర్గాలకు(ఈడబ్ల్యూఎస్) సంబంధించి కోటాపై స్పష్టత లేనందున దానిపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

    2019-20 విద్యాసంవత్సరానికి ఓయూ పరీక్ష నిర్వహిస్తోంది. అదే 2020-21కి కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం నిర్వహణ బాధ్యతలు రెండు వర్సిటీల మధ్య మారుతుంటాయి.

    సీపీజీఈటీ పూర్తి వివరాలు..

    పరీక్ష పరిధిలోకి వచ్చే యూనివర్సిటీలు : ఓయూ, కేయూ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్
    దరఖాస్తుల సమర్పణ : జరిమానా లేకుండా ఈ నెల 30 నుంచి మే 30 వరకు.
    రూ. 500 లేట్ ఫీజుతో జూన్ 1 నుంచి 6 వ తేదీ వరకు..
    రూ. 2,000 లేట్ ఫీజుతో జూన్ 7 నుంచి 11 వ తేదీ వరకు..
    ఫీజు : ఓసీ, బీసీలకు రూ.800
    ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600
    ఇతర ప్రతి అదనపు సబ్జెక్టుకి రూ.400
    ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ : జూన్ 14వ తేదీ నుంచి 26 వరకు ( ఒక్కో రోజు 3 విడతలుగా ఉంటాయి)
    ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించే ప్రాంతాలు : 25
    హాజరయ్యే విద్యార్థులు : లక్ష మంది
    రాష్ట్రవ్యాప్తంగా ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర సీట్లు : 30 సీట్లు
    First published:

    Tags: CAREER, EDUCATION, Exams, NOTIFICATION, Results, Telangana, Telangana News, Telangana updates

    తదుపరి వార్తలు