Home /News /jobs /

ONE DIED IN A HORRIFIC ROAD ACCIDENT ANOTHER IS IN CRITICAL CONDITION IN GADWAL DISTRICT VB MBNR

Road Accident: 'అమ్మా బాయ్' అంటూ వెళ్లాడు.. కారు రూపంలో వెంటాడిన మృత్యువు.. ఆ తల్లి రోదనలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: ఆమె పాఠశాలలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమెను పాఠశాల వద్ద దింపి నవ్వుతూ బయలుదేరిన భర్త, కుమారుడు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారని.. తమ బాబు మృతిచెందాడని తెలిసి కన్నీరుమున్నీరయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్, న్యూస్18 తెలుగు) 

    ఆమె పాఠశాలలో విధులు నిర్వర్తిస్తోంది. పాఠశాల వద్ద ఆమెను దించి తన భర్త, కొడుకు ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొడుకు అక్కడిక్కడే చనిపోగా తన భర్తకు తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిన తనయుడు విగతజీవిగా మారడం చూసి ఆ తల్లి పడిన ఆవేదన అందరిని కలచివేసింది. ఈ ఘటకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం సంఘాల చెరువు కట్ట సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి చెందగా అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు ..

    గద్వాల లోని ఎర్రమట్టి వీధికి చెందిన మున్ని గోను పాడు కస్తూర్భా విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త నవీన్, కుమారుడు అఖిలేష్ రాజు( 8 ) ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి విద్యాలయంలో వదిలిపెట్టి తిరుగు ప్రయాణమయ్యారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంఘాల చెరువు కట్ట సమీపంలో కర్ణాటక నుంచి గద్వాల వైపు వెళ్తున్న ఒక కారు అతి వేగంగా వచ్చి వెనకనుంచి వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వీరిద్దరూ కింద పడిపోగా అఖిలేష్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

    నవీన్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కార్ ను వదిలేసి పరారయ్యాడు. రహదారిపై చిన్నారి మృతదేహం పడి ఉండటం చూసి స్థానికులు, ప్రయాణికులు చలించిపోయారు. గద్వాల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ఆసుపత్రికి పంపించారు. ఆస్పత్రి వద్ద బాలుడి తల్లి రోదన అందరిని కంట తడి పెట్టించింది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime news, Gadwal, Gadwal town, Road accident

    తదుపరి వార్తలు