హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIM Professor: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ వరకు... నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తున్న సక్సెస్ స్టోరీ

IIM Professor: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ వరకు... నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తున్న సక్సెస్ స్టోరీ

IIM Professor: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ వరకు... నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తున్న సక్సెస్ స్టోరీ
(ఎడమవైపు రంజిత్ రామచంద్రన్, కుడివైపు కేరళలోని ఆయన ఇల్లు)

IIM Professor: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ వరకు... నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తున్న సక్సెస్ స్టోరీ (ఎడమవైపు రంజిత్ రామచంద్రన్, కుడివైపు కేరళలోని ఆయన ఇల్లు)

IIM Professor | ఓ ఐఐఎం ప్రొఫెసర్ విజయగాధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసిన రంజిత్ రామచంద్రన్ ఇప్పుడు ఐఐఎం ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు.

దృఢమైన సంకల్పం ఉన్నవారు లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి అవరోధాలను లెక్కచేయరని మరోసారి నిరూపితమైంది. కొన్నాళ్ల క్రితం నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు IIMలో ప్రొఫెసర్‌ అయ్యారు. మట్టి గోడలతో నిర్మించిన, సరైన తలుపులు కూడా లేని ఆ ప్రొఫెసర్‌ ఇంటి ఫోటోలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నాయి. ‘ఒక IIM ప్రొఫెసర్ ఇక్కడ జన్మించాడు’ అనే ట్యాగ్‌తో ఉన్న ఈ ఫోటో వెనుక ఉన్న కథ నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తోంది. కేరళకు చెందిన రంజిత్ రామచంద్రన్ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల రంజిత్ రామచంద్రన్ ఫేస్‌బుక్‌లో తన ఇంటి ఫోటోను పోస్ట్ చేశాడు. శిథిలమైన, పాత పెంకుల గుడిసె తన ఇళ్లు అని చెప్పాడు. వర్షానికి తడవకుండా దానికి పైకప్పుగా పెద్ద టార్పాలిన్ కవర్ ఉంది. అలాంటి ఇంట్లో పుట్టిన రంజిత్ ఇప్పుడు IIM-రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న పనాతూరుకు చెందిన 28 ఏళ్ల ఈ యువకుడి ప్రస్థానాన్ని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఉన్నత లక్ష్యం కోసం అతడు పడిన కష్టం ప్రశంసనీయమని చెబుతున్నారు.

DSSSB Teacher Recruitment 2021: గుడ్ న్యూస్... 12,065 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

నిరుపేద కుటుంబం


ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన ఫోటో రంజిత్ స్వగృహం. తన ప్రస్థానం గురించి సోషల్ మీడియాలో వెల్లడించిన తరువాత ఆయన గురించి ప్రపంచానికి పూర్తి వివరాలు తెలిశాయి. ఆ ఇంట్లో అతడి తండ్రి, తల్లి, ఇద్దరు తోబుట్టువులు.. మొత్తం ఐదుగురు నివసిస్తున్నారు. తండ్రి ఒక టైలర్. తల్లి దినసరి కూలీ. ఈ స్థాయికి రావడానికి రంజిత్ ఎంతో కష్టపడ్డాడు. కుటుంబ పోషణ కష్టం కావడంతో ఒక దశలో చదువు మానేయాలనుకున్నాడు. కానీ ఆ ఆలోచనను పక్కనపెట్టి పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో BSNL టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పని చేశాడు. ఇందుకు రూ.4,000 జీతంగా ఇచ్చేవారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూడటం అతడి బాధ్యత. ఇలా ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య పూర్తి చేశాడు.

ఐదేళ్లు వాచ్‌మెన్ ఉద్యోగం


రంజిత్ ముందు నుంచి చదువుల్లో ముందుండేవాడు. అతడు మరాఠీ మాట్లాడే షెడ్యూల్డ్ తెగకు చెందినవాడు. ST రిజర్వేషన్ కూడా ఉంది. చదువులో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అతడు వందశాతం సద్వినియోగం చేసుకున్నాడు. రంజిత్ రాజాపురంలోని పీయస్ టెన్త్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ కోర్సులో చేరాడు. ఆ తరువాత కాసర్‌గోడ్‌లోని కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివాడు. పీజీ పూర్తి చేసే వరకు ఐదేళ్ల పాటు నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం మానలేదు. పీజీ తరువాత IIT-మద్రాస్‌లో PhD పూర్తి చేశాడు.

Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి 10 ఐడియాలు

APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఎదురైన అవరోధాలు


PhD చేసే సమయంలో ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేక రంజిత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో పరిశోధన కొనసాగించడం కష్టంగా మారింది. ఫలితంగా ఒక దశలో పీహెచ్‌డీని వదిలేయాలి అనుకున్నాడు. కానీ తన గైడ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిసెర్చ్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో IIMలో ఆచార్యుడిగా పనిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఫలితం సాధించాడు. రంజిత్ బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో రెండు నెలల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన నియామకాల్లో రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తనలాంటి ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో తన సక్సెస్ స్టోరీని ఫేస్‌బుక్ వేదికగా పంచుకున్నానని రంజిత్ తెలిపారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, EDUCATION, Success story

ఉత్తమ కథలు