• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • OMPL RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 25 GRADUATE TECHNICIAN APPRENTICE TRAINEE POSTS SS

OMPL Jobs 2021: ఓఎన్‌జీసీ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

OMPL Jobs 2021: ఓఎన్‌జీసీ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

OMPL Jobs 2021: ఓఎన్‌జీసీ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

OMPL Jobs 2021 | ఓఎన్‌జీసీకి చెందిన సంస్థలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ జరుగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC కి చెందిన సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్-OMPL గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.ompl.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే omplhr@omplindia.com మెయిల్ ఐడీకి మెయిల్ చేయాలి.

    OMPL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 25

    గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 17
    కెమికల్- 8
    ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 3
    ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్- 2
    మెకానికల్- 4

    టెక్నీషియన్ అప్రెంటీస్- 8
    కెమికల్- 1
    ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 3
    మెకానికల్- 4

    IOCL Recruitment 2020: ఐఓసీఎల్‌లో 543 ఉద్యోగాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

    RRB Exams: ఆర్ఆర్‌బీ అభ్యర్థులకు అలర్ట్... ఎగ్జామ్‌కు వెళ్తే ఈ రూల్స్ పాటించాల్సిందే

    OMPL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 2
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 1
    విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీసీ పోస్టుకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా పాస్ కావాలి. 2018, 2019, 2020 లో క్వాలిఫయింగ్ ఎగ్జామ్ పాస్ కావాలి.
    స్టైపెండ్- రూ.8000
    ఎంపిక విధానం- మార్కుల ఆధారంగా దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.

    AAI Recruitment 2020: ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 368 జాబ్స్... రూ.1,00,000 పైగా జీతం

    Wipro Jobs 2021: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్... రూ.30,000 జీతంతో విప్రోలో ఉద్యోగాలు

    OMPL Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    అభ్యర్థులు https://www.ompl.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Engagement of Apprentice లింక్ పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Registration Form పైన క్లిక్ చేయాలి.
    మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, అడ్రస్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
    దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు