Home /News /jobs /

OLA CARS HAS ANNOUNCED PLANS TO HIRE 10000 PEOPLE AS PART OF ITS PLANS TO EXPAND ITS BUSINESS PRV GH

Ola Cars: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్న ఓలా కార్స్​

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఓలా కంపెనీ (Ola company) "ఓలా కార్స్‌" అనే ఓ సరికొత్త వెహికల్ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓలా కార్స్‌ (Ola cars) సేవలను ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేలా ఓలా కంపెనీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

jobsకొద్ది రోజుల క్రితం ఓలా కంపెనీ (Ola company) "ఓలా కార్స్‌" అనే ఓ సరికొత్త వెహికల్ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓలా కార్స్‌ (Ola cars) సేవలను ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యేలా ఓలా కంపెనీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఓలా కార్స్‌ సేవలను 100 నగరాలకు (cities) విస్తరించాలన్న లక్ష్యంతో వచ్చే 12 నెలల్లో 10,000 మంది ఉద్యోగులను (employees) నియమించాలని యోచిస్తున్నట్లు గురువారం కంపెనీ తెలిపింది. ఓలా కార్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా 2 బిలియన్ డాలర్ల గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ(GMV) సాధించి మార్కెట్‌లో నాయకత్వ  స్థానం (leadership in market) చేజిక్కించుకునేందుకే కొత్తగా వేలాది మందిని నియమించుకోవాలని (recruit) భావిస్తున్నట్టు వివరించింది.

వచ్చే రెండు నెలల్లో..

కంపెనీ ప్రకటన ప్రకారం వచ్చే రెండు నెలల్లో ఓలా కార్స్ (Ola cars) సేవలు 30 నగరాల్లో అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది నాటికి 100 నగరాలకు విస్తరిస్తాయి. ఓలా కార్స్ సేవలు ప్రారంభమైన నెలరోజుల్లోనే 5,000 ప్రీ-ఓన్డ్ (సెకండ్-హ్యాండ్) కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌ (platform) వేదికగా కొత్త, పాత వాహనాల (old vehicles)ను విక్రయానికి పెడతారు. ఇందులో రకరకాల బ్రాండ్స్ కార్లు ఉంటాయి. యూజర్లు తమకు నచ్చిన కార్లను ఎంచుకొని టెస్ట్ డ్రైవ్ (Test drive) చేయొచ్చు. నచ్చితే కొనుగోలు కూడా చేయొచ్చు.

ఇప్పటికే 5,000 కార్లు అమ్ముడయ్యాయి..

ఓలా కార్స్ సీఈఓ అరుణ్ సిర్దేష్ ముఖ్ మాట్లాడుతూ..  "ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్‌తో మేము కార్ల కొనుగోలు, రీసేల్, ఓనర్ షిప్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తున్నాము. మా ‘కొత్త కంటే మెరుగైన (better than new)’ బైయింగ్ ఎక్స్పీరియన్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మా మొదటి పూర్తి నెల ఆపరేషన్‌లో ఇప్పటికే 5,000 కార్లు అమ్ముడయ్యాయి. రాబోయే నెలల్లో మేం మా సేవలను 100 నగరాలకు వేగంగా విస్తరించబోతున్నాం. కీలక ప్రాంతాలతో సహా సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ల (sales and service centers)లో పదివేల మందిని నియమించుకోనున్నాం" అని వెల్లడించారు.

కొత్త వాహనాల కోసం కూడా ఈ ప్లాట్‌ఫామ్‌..

ఓలా కార్స్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో పాత వాహన విక్రయాలను ప్రారంభించింది. ఈ సేవలు ఈ వారం చివరి నాటికి చండీగఢ్, జైపూర్, కోల్‌కతా, ఇండోర్‌లకు విస్తరిస్తాయి. ఓలా దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల (service center)ను కూడా ఏర్పాటు చేస్తోంది. తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇతర ఆటోమోటివ్ బ్రాండ్ల నుంచి కొత్త వాహనాల కోసం కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేస్తామని ఓలా తెలిపింది. వాహనం కొనుగోలు దగ్గర నుంచి వాహన రుణం, బీమా (Insurance), రిజిస్ట్రేషన్‌ వంటి పలు రకాల సేవలను ఓలా కార్స్‌ యే చూసుకుంటుందని గతంలో ఓలా తెలిపింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Cars, JOBS, Ola

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు