• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • OIL RECRUITMENT 2020 10TH PASS CAN APPLY FOR THESE GOVERNMENT JOBS NS

OIL Recruitment 2020: టెన్త్, ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

OIL Recruitment 2020: టెన్త్, ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమో పాస్ అయిన వారు, గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Share this:
    నిరుద్యోగులకు ఆయిల్ ఇండియా కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిప్లొమో పాస్ అయిన వారు, గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయిల్ ఇండియా అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు రాజస్థాన్ లో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    ఖాళీల వివరాలు..
    అసిస్టెంట్ ఆపరేటర్(ఫిట్టర్): 1పోస్టు
    అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్): 1పోస్టు
    అసిస్టెంట్ టెక్నీషియన్(Draughtsman Civil): 1 పోస్టు
    జూనియర్ అసిస్టెంట్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్: 4 పోస్టులు
    సీనియర్ అసిస్టెంట్(హిందీ ట్రాన్స్ లేటర్)-1 పోస్టు
    సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్)-1 పోస్టు
    టెక్నీషియన్(కెమికల్ ల్యాబ్): 1 పోస్టు
    జూనియర్ ఇంజినీర్(సివిల్): 1 పోస్టు
    కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్ లేటర్లకు స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.

    ఎంపిక ఎలా ఉంటుందంటే..
    అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్, మెంటల్ ఎబులిటి తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానికి 0.25 నెగటీవ్ మార్కులు ఉంటాయి. ఆయా పోస్టులకు అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
    Official Website-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు