OIL INDIA RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES NS
Oil India Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత ప్రభుత్వానికి (Central Government) చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల(Jobs) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గ్రేడ్ V, గ్రేడ్ III విభాగాల్లో మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిప్లొమా, బీఎస్పీ ఉత్తర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నటోిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 25 నాటికి 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. Govt jobs 2022: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. ఈ జాబ్స్ అప్లై చేశారా.. కొద్ది రోజులే చాన్స్!
ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ తో పాటు ఆయిల్ ఇండియాకు సంబంధించిన ప్రశ్నలు 20 మార్కులకు ఉంటాయి. ఇంకా రీజనింగ్, ఆర్థమేటిక్/న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ కి 20 మార్కులు, టెక్నికల్ నాలెడ్జ్ పేపర్ కు మరో 60 మార్కులకు ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ లో అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1:అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ (https://www.oil-india.com/default.aspx) సైట్ ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం Careers విభాగంలో Current Openings ను ఎంచుకోవాలి. Step 3:సంబంధిత నోటిఫికేషన్ పక్కన Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 4:అనంతరం Register ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 5:కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.