ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ Oil India నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. మొత్తం 146 ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అస్సాం(Assam), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.45 లక్షల వేతనం(Salary) చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేష్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
కెమికల్ ఇంజినీరింగ్ | 8 |
సివిల్ ఇంజినీరింగ్ | 12 |
కంప్యూటర్ ఇంజినీరింగ్ | 5 |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | 21 |
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ | 3 |
ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ | 32 |
మెకానికల్ ఇంజినీరింగ్ | 65 |
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Apply Online పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ‘Register Now’ పై క్లిక్ చేయాలి.
IOCL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్. ఇండియన్ ఆయిల్ లో 527 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
Step 4: పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 5: రిజిస్ట్రేషన్ అనంతరం యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
Step 6: ఈ వివరాలతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
CRPF Recruitment 2021: భారీ వేతనంతో సీఆర్పీఎఫ్ లో ఉద్యోగాలు.. 22వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు.. వివరాలివే
అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇతర వివరాలు..
-అప్లై చేసే సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-దరఖాస్తుకు డిసెంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
-ఈ ఖాళీలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Government jobs, Job notification, JOBS