Home /News /jobs /

OIL INDIA RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 146 ENGINEER VACANCIES HERE FULL DETAILS NS

Oil India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. రూ. 1.45 లక్షల వేతనంతో ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త.. రూ. 1.45 లక్షల వేతనంతో ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు..ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు శుభవార్త.. రూ. 1.45 లక్షల వేతనంతో ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు..ఇలా అప్లై చేయండి

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా(Oil India) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 9ని ఆఖరి తేదీగా నిర్ణియించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ Oil India నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 146 ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అస్సాం(Assam), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.45 లక్షల వేతనం(Salary) చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేష్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    HPCL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. HPCLలో రూ. 25 వేల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
































    కెమికల్ ఇంజినీరింగ్8
    సివిల్ ఇంజినీరింగ్12
    కంప్యూటర్ ఇంజినీరింగ్5
    ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్21
    ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్3
    ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ32
    మెకానికల్ ఇంజినీరింగ్65

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Apply Online పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ‘Register Now’ పై క్లిక్ చేయాలి.
    NPCIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో రూ. 44,900 వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    Step 4: పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    Step 5: రిజిస్ట్రేషన్ అనంతరం యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
    Step 6: ఈ వివరాలతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    AP Job Mela: ఏపీలో Airtel, Apollo, Varun Motors తదితర సంస్థల్లో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు.. వివరాలివే

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



    CSIR Jobs: హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. జీతం రూ.ల‌క్ష‌.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం
    ఇతర వివరాలు..
    -అప్లై చేసే సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
    -దరఖాస్తుకు డిసెంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -ఈ ఖాళీలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు