Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)

Oil India Recruitment 2021 | ఆయిల్ ఇండియా లిమిటెడ్ 115 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు కాంట్రాక్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, కెమికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 115 ఖాళీలు ఉన్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రొడక్షన్, ఎక్స్‌ప్లోరేషన్ యూనిట్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇవి ఆరు నెల కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది ఆయిల్ ఇండియా లిమిటెడ్. 2021 ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 13 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆయిల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.oil-india.com/ లో తెలుసుకోవచ్చు. వాకిన్ ఇన్ ఇంటర్వ్యూకు వెళ్లేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    Oil India Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 115
    అసిస్టెంట్ వెల్డర్- 1
    అసిస్టెంట్ ఫిట్టర్- 2
    అసిస్టెంట్ డీజిల్ మెకానిక్- 5
    ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్- 5
    గ్యాస్ లాగర్- 8
    అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రీషియన్- 10
    కెమికల్ అసిస్టెంట్- 10
    అసిస్టెంట్ మెకానిక్ పంప్-17
    డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్- 26
    అసిస్టెంట్ మెకానిక్- 31

    VSSC Recruitment 2021: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో 158 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Railway Jobs: రైల్వే జాబ్ అలర్ట్... మరో నోటిఫికేషన్ వచ్చేసింది... రూ.92,300 వరకు వేతనం

    Oil India Recruitment 2021: రిజిస్ట్రేషన్, వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీలు


    అసిస్టెంట్ వెల్డర్- 2021 ఆగస్ట్ 16
    అసిస్టెంట్ ఫిట్టర్- 2021 ఆగస్ట్ 18
    అసిస్టెంట్ డీజిల్ మెకానిక్- 2021 ఆగస్ట్ 20
    ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్- 2021 ఆగస్ట్ 23
    గ్యాస్ లాగర్- 2021 ఆగస్ట్ 25
    అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రీషియన్- 2021 ఆగస్ట్ 30
    కెమికల్ అసిస్టెంట్- 2021 సెప్టెంబర్ 2
    అసిస్టెంట్ మెకానిక్ పంప్- 2021 సెప్టెంబర్ 6
    డ్రిల్లింగ్ రిగ్‌మ్యాన్- 2021 సెప్టెంబర్ 8
    అసిస్టెంట్ మెకానిక్- 2021 సెప్టెంబర్ 13

    Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే

    IT Jobs 2021: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి 1,20,000 ఉద్యోగాలు

    Oil India Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ కావాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు
    అభ్యర్థుల వయస్సు- పోస్టును బట్టి వేర్వేరుగా వయస్సు వివరాలు ఉన్నాయి. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు.
    కాంట్రాక్ట్ గడువు- ఆరు నెలలు. సంస్థ అవసరాలు, ఉద్యోగుల పనితీరు, ఫిజికల్ ఫిట్‌నెస్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది.
    వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే వేదిక- Employee Welfare Office, Nehru Maidan, Oil India Limited, Duliajan.
    Published by:Santhosh Kumar S
    First published: