Home /News /jobs /

Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో 146 ఉద్యోగాలు.. నెలకు రూ. 1.45 లక్షల భారీ వేతనం.. ఇలా అప్లై చేయండి

Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో 146 ఉద్యోగాలు.. నెలకు రూ. 1.45 లక్షల భారీ వేతనం.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా(Oil India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది.

    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ Oil India నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. మొత్తం 146 ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అస్సాం(Assam), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.45 లక్షల వేతనం(Salary) చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేష్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
































    కెమికల్ ఇంజినీరింగ్ 8
    సివిల్ ఇంజినీరింగ్ 12
    కంప్యూటర్ ఇంజినీరింగ్ 5
    ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 21
    ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 3
    ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 32
    మెకానికల్ ఇంజినీరింగ్ 65

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Apply Online పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ‘Register Now’ పై క్లిక్ చేయాలి.
    Step 4: పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    Step 5: రిజిస్ట్రేషన్ అనంతరం యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
    Step 6: ఈ వివరాలతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
    Jobs in AP: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో 126 ఖాళీలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IOCLలో 1968 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్
    ఇతర వివరాలు..
    -అప్లై చేసే సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
    -దరఖాస్తుకు డిసెంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -ఈ ఖాళీలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CAREER, Career and Courses, Central Government Jobs, Job notification, JOBS

    తదుపరి వార్తలు