• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • OIL INDIA RECRUITMENT 2021 APPLICATIONS INVITED FOR 119 VACANCIES HERE NOTIFICATION LINK AND OTHER DETAILS NS

Oil India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Oil India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తున్నా.. ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్య‌ర్థులు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నారు.
    NTPC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అప్లికేషన్లకు ఈ రోజే లాస్ట్ డేట్
    IIT Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐఐటీలో డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. పూర్తి వివరాలివే..

    ఖాళీల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్యాస్ లాగర్ విభాగంలో 20, అసిస్టెంట్ మెకానిక్ విభాగంలో 79, డ్రిల్లింగ్ టాప్ మ్యాన్ విభాగంలో 17, కెమికల్ అసిస్టెంట్ విభాగంలో 10, అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రిక్ సూపర్ వైజర్ 5, డ్రిల్లింగ్ రిగ్ మ్యాన్ విభాగంలో 5, డ్రిల్లింగ్ హెడ్ మ్యాన్ విభాగంలో 4 చొప్పున ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    Official Website - Direct Link
    Notification - Direct Link

    విద్యార్హతల వివరాలు..
    వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయో పరిమితి కూడా వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా నిర్ణయించారు. కెమికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు మే 22లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను మే 24 నుంచి జూన్ 22 వరకు నిర్వహించనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: