Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో 35 ఉద్యోగాలు.. రూ.2,20,000 వరకు వేతనం

Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో 35 ఉద్యోగాలు.. రూ.2,20,000 వరకు వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

Oil India Recruitment 2021 | ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అస్సాంలోని దులియాజన్‌లో గల ఫీల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో 535 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 23 చివరి తేదీ. ఇప్పుడు గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ, గ్రేడ్ సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 35 ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నీ అస్సాంలోనే ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు (Job Notification) సంబంధించిన పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో 100 ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు

    Oil India Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





























































     మొత్తం ఖాళీలు  35
     సూపరింటెండింగ్ ఇంజనీర్ (డ్రిల్లింగ్) 1
     సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్ (రేడియాలజీ)  1
     సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎన్విరాన్‌మెంట్)  3
     సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్ (ఆర్థోపెడిక్ సర్జన్)  1
     సీనియర్ మెడికల్ ఆఫీసర్   4
     సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్  1
     సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)  6
     సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)  2
     సీనియర్ ఆఫీసర్ (ల్యాండ్ అండ్ లీగల్) 2
     సీనియర్ ఆఫీసర్ (మెకానికల్)  10
     సీనియర్ ఆఫీసర్ (జియోఫిజిక్స్)  1
     సీనియర్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)  2
     కాన్ఫిడెన్షియల్ సెక్రెటరీ  1

    Job Ideas: రొటీన్ జాబ్ బోర్ కొట్టిందా? ఈ 8 ఐడియాలతో డబ్బు సంపాదించండి

    Oil India Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 15

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 10

    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ.

    వేతనం- రూ.1,60,000 నుంచి రూ.2,20,000 వరకు

    పోస్టింగ్- అస్సాం

    విద్యార్హతలు- అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.

    దరఖాస్తు ఫీజు- రూ.500

    Assam Rifles Jobs 2021: టెన్త్ పాస్ అయినవారికి అస్సాం రైఫిల్స్‌లో 1230 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Oil India Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://www.oil-india.com/Current_openNew.aspx వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- Recruitment of Grade C, Grade B and Grade A Officers in OIL సెక్షన్‌లో

    Step 3- Apply Online పైన క్లిక్ చేయాలి.

    Step 4- ఆ తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి.

    Step 5- అప్లై చేయాలనుకునే పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి.

    Step 6- పేరు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

    Step 7- Continue క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

    Step 8- ఆ తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.

    Step 9- తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 10- తర్వాతి సెక్షన్‌లో ఫోటో, సంతకం, సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 11- చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 12- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: