ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల్ని ప్రకటించింది. ఇంజనీరింగ్, జియో సైన్స్ విభాగాల్లో గేట్-2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఓఎన్జీసీ అధికారిక వెబ్సైట్ ongcindia.com ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ 2020 మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఓఎన్జీసీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారికి గేట్ 2020 స్కోర్ ఉండాలి. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసినవాళ్లు కూడా దరఖాస్తు చేయొచ్చు. గేట్ 2020 ఫలితాలు విడుదలైన తర్వాత ఇందులో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఓఎన్జీసీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ట్రైనీ
విద్యార్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు గేట్ 2020 స్కోర్ తప్పనిసరి. చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు: జనరల్ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: గేట్ 2020 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.