ఐటీఐ డిప్లొమా పాసైనవారికి శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 214 పోస్టులున్నాయి. ముంబైలోని ఓఎన్జీసీలో 7 ట్రేడ్స్‌లో ఈ పోస్టుల్ని నియమించనుంది. అర్హత గల అభ్యర్థులు www.ongcapprentices.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూలై 31 చివరి తేదీ. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా చేసినవాళ్లు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://www.ongcapprentices.co.in/ వెబ్సైట్ చూడండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.