పేద విద్యార్థులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC లిమిటెడ్ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక కారణాల వల్ల చదువుకు దూరం అవుతున్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రారంభించింది ఓఎన్‌జీసీ. 1000 మంది విద్యార్థులకు ఏటా రూ.48,000 స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. ఇంజనీరింగ్, మెడికల్ స్ట్రీమ్, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌లో మాస్టర్స్ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందొచ్చు. కుటుంబ ఆదాయం వార్షికంగా రూ.4.50 లక్షల లోపు ఉన్న విద్యార్థులే ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయాలి. మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేయనుంది ఓన్‌జీసీ. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ స్కీమ్ అప్లికేషన్ ఫార్మాట్, ఇతర వివరాలను 2019 ఆగస్ట్ 31 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించనుంది ఓఎన్‌జీసీ. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం స్కాలర్‌షిప్స్: 1000
ఇంజనీరింగ్ విద్యార్థులకు: 494
ఎంబీబీఎస్ విద్యార్థులకు: 90
ఎంబీఏ విద్యార్థులకు: 146
మాస్టర్స్ ఇన్ జియాలజీ, జియోఫిజిక్స్ విద్యార్థులకు: 270
అమ్మాయిలకు 50% అంటే 500 స్కాలర్‌షిప్స్
నార్త్, వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, సౌత్ జోన్లకు 200 చొప్పున స్కాలర్‌షిప్స్ కేటాయింపు
వార్షిక స్కాలర్‌షిప్: రూ.48,000
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 15
స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారి జాబితా వెల్లడించే తేదీ: 2019 డిసెంబర్ 10
ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ వివరాల కోసం http://www.ongcindia.com వెబ్‌సైట్ చూడండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
DEET App: ఉద్యోగం కావాలా? డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్‌లో రిజిస్టర్ చేసుకోండిలా
IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 జాబ్స్... పరీక్షల సిలబస్ తెలుసుకోండి
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, EDUCATION, JOBS, ONGC, Scholarship