హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE 2023 Online Application: GATE దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

GATE 2023 Online Application: GATE దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

GATE 2023

GATE 2023

GATE 2023: ఇంజనీరింగ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రతీ సంవత్సరం గేట్(Graduate Aptitude Test In Engineering) నిర్వహిస్తారు. గేట్ 2023 కోసం ఇప్పటికే టైమ్ టేబుల్ విడుదల చేయబడింది. ప్రతి సంవత్సరం ఈ పరీక్షను వివిధ ఇంజనీరింగ్ శాఖలకు నిర్వహిస్తారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇంజనీరింగ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రతీ సంవత్సరం గేట్(Graduate Aptitude Test In Engineering) నిర్వహిస్తారు. గేట్ 2023 కోసం ఇప్పటికే టైమ్ టేబుల్ విడుదల చేయబడింది. ప్రతి సంవత్సరం ఈ పరీక్షను వివిధ ఇంజనీరింగ్ శాఖలకు నిర్వహిస్తారు. ఇది Mtech లేదా ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయడానికి లేదా PSUలో ఉద్యోగం పొందడానికి ప్రవేశ ప్రక్రియ. షెడ్యూల్ ప్రకారం GATE పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022. అయితే ప్రస్తుతం ఈ దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పుడు అభ్యర్థులు 4 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే.. అధికారిక వెబ్‌సైట్ gate.iitk.ac.inని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే GATE 2023 కోసం ఆలస్య రుసుముతో అభ్యర్థులు 7 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ 500 ఆలస్య రుసుముగా చెల్లించాలి. SC, ST, మహిళలు, PWD కేటగిరీ అభ్యర్థులు రుసుముగా రూ.850 చెల్లించాలి. విదేశీ పౌరులతో సహా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1700 ఉంటుంది.

Abroad For Education: విదేశాల్లో చదువు కోసం వెళ్తున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..

ఇలా నమోదు చేసుకోండి

Step 1 : ముందుగా అభ్యర్థులు gate.iitk.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2 : హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న “గేట్ 2023 రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : పోర్టల్‌లో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.

Step 4 : నమోదు చేసుకున్న తర్వాత, సిస్టమ్ రూపొందించిన రిజిస్ట్రేషన్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.

Step 5 : తర్వాత GATE 2023 దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

Step 6 : అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

Step 7 : అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.

Step 8 : మీరు దరఖాస్తు రుసుమును చెల్లించిన తర్వాత, ఫారమ్‌ను సమర్పించవచ్చు.

Step 9 : GATE 2023 దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి . భవిష్యత్తు సూచన కోసం దాన్ని ప్రింటౌట్ తీసుకోండి.

అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే..

GATE రిజిస్ట్రేషన్ ఫారమ్ 2023 ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యర్థులకు ఆఫ్‌లైన్ ఫారమ్‌ను పూరించడానికి ఎటువంటి సదుపాయం ఇవ్వబడదు.

అభ్యర్థులు తమ దరఖాస్తు లేదా పత్రాల హార్డ్ కాపీని IIT కాన్పూర్ అధికారులకు లేదా ఏదైనా జోనల్ గేట్ కార్యాలయాలకు పంపాల్సిన అవసరం లేదు.

IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌లో గేట్ 2023 పరీక్ష తేదీని కూడా ప్రచురించింది. GATE పరీక్ష 2023 ఫిబ్రవరి 4, 5, 11 మరియు 12 తేదీల్లో 29 పేపర్లకు నిర్వహించబడుతుంది.

అడ్మిట్ కార్డ్‌లు జనవరి 3, 2023న జారీ అవుతాయి.

Jobs In SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్.. డిగ్రీతో 990 పోస్టులు భర్తీ..

దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరం అవుతాయి..

1. అభ్యర్థి ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ.

2. చెల్లుబాటు అయ్యే ఫోటో ID – ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/PAN కార్డ్/ఓటర్ ID/కాలేజ్ ID

3. డిగ్రీ/ ప్రొవిజనల్ సర్టిఫికెట్

4. 5వ/6వ/7వ సెమిస్టర్ మార్క్‌షీట్‌ల ప్రింట్‌అవుట్‌లు

5. హోమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్/డీన్/రిజిస్ట్రార్/హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన ఫార్మాట్ ప్రకారం ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లెటర్‌ను సమర్పించాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Gate 2023, JOBS

ఉత్తమ కథలు