హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Constable Last Minute Tips: అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. వీటిని తప్పక పాటించండి..

Constable Last Minute Tips: అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. వీటిని తప్పక పాటించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Constable Last Minute Tips: కానిస్టేబుల్ జాబ్స్ (TS Constable Jobs) కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఐతే.. ఈ ఒక్క రోజు చదవడం ఒక ఎత్తు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కానిస్టేబుల్ జాబ్స్ (TS Constable Jobs) కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఐతే.. ఇప్పుడు ఉన్న టైం లో చదవడం అనేది మరొక ఎత్తు. అయితే ఈ 24 గంటలు ప్రిపరేషన్ ను ఎలా కొనసాగించాలి.. ఈ టైంలో ఏం చూసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం..  కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ ఐయ్యే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్, తరువాత ఈవెంట్స్ ఉంటాయి. ఇవి క్వాలిఫై ఐతే మెయిన్స్ ఉంటాయి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టోటల్(Prelims Exam Total Marks) 200 మార్కులకు ఎగ్జామ్స్(Exams) ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 100 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ 20మార్కులకు ఉంటుంది.


TSPSC Group 3-Group 4: గుడ్ న్యూస్.. గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..


తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 80 మార్కులు ఉంటాయి. ఇందులో 60మార్కులు వస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 60మార్కులు రావాలంటే 5 తప్పులకు ఒక నెగటివ్ మార్కు ఉంటుంది. అభ్యర్థులు జాగ్రత్త గా చూసి ఆన్సర్ లు సెలక్ట్ చేస్తేనే 60మార్కులు సాధించవచ్చు. అప్పుడే ప్రిలిమ్స్ లో మనం విజయం సాధించినవారమవుతాము. క్లాస్ రూంలో విన్న నోట్స్, అలాగే.. ఎక్కువగా మక్ టెస్ట్ లు రాస్తారో వాళ్లు మంచి స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతంలో కూడా సేమ్ ఇలానే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. 60మార్కులే కదా చాలా మంది లైట్ గా తీసుకుంటే అప్పుడె వేయిల మంది ఫిల్టర్ ఐపోయారు. సో గత ఎగ్జామ్స్ ను గుర్తుపెట్టుకొని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సన్నద్ధం కావాలి.ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయంలో కొత్త పుస్తకాలు అస్సలు చదవకూడదు. చదివిన వాటిని రివిజన్ చేసుకుంటే మంచిది. మ్యాథ్స్ ఫార్ములాలను ఈ ఒక్క రోజు మరో సారి చూసుకోండి. పరీక్ష హాల్లో ఎలాంటి టెన్షన్ కు గురి కావద్దు. ఇప్పటికే పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని వివరించారు.


కానిస్టేబుల్‌ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించదని స్పష్టం చేశారు. ఆదివారం జరగనున్న ఈ పరీక్ష కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1601 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6,61,196 మంది పరీక్ష ను రాయనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకాలు కోసం పరీక్ష జరుగుతోంది.


Easy To Get 60 Marks: 60 మార్కులు తెచ్చుకోవడం ఇంత సులువా.. కానిస్టేబుల్ కు ఈ ఒక్క స్ట్రాటజీ చాలు.. 60 మార్కులు వచ్చినట్లే..


అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..


-కోవిడ్ 19 నేపథ్యంలో మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.


-హాల్ టికెట్స్ ను ఏ4 సైజ్ పేపర్ లోనే డౌన్ లోడ్ చేసుకుకోవాలి.


-అనంతరం అందులో నిర్ధేషించిన స్థలంలో అభ్యర్థి ఫొటోను గమ్ తో అంతికించుకోవాలి.


-దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఫొటోలపై పిన్ కొట్టొద్దు. ఇలా చేస్తే పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదు.


-చేతులకు మెహందీ, టాటూలు ఉంచకోకూడదు.


-హాల్లోకి హాల్ టికెట్స్ తో పాటు.. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ ను మాత్రమే తీసుకెళ్లాలి.


-మహిళా అభ్యర్థులు నగదు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లొక్ రూం సదుపాయం ఉండదు.


-ఓఎమ్ ఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారని హాల్ టికెట్స్ లో పేర్కొన్న నిబంధనలు చెబుతున్నాయి.

First published:

Tags: Career and Courses, JOBS, Tslprb

ఉత్తమ కథలు