తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి గ్రూప్-1 పరీక్షకు సంబంధించి అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుండగా.. ఇప్పటి నుంచే పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు(District Collector) అలర్ట్ అయ్యారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని TSPSC చైర్మన్ జనరార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(Group 1 Prelims) పరీక్షను జూలై నెలలోనే నిర్వహిచాలి.. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఉండటంతో.. దీనిని అక్టోబర్ 16కు వాయిదా వేశారు. ఈ పరీక్ష తేదీగా కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పుకార్లు లేచాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 పరీక్ష కచ్చితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో అధికారులు కూడా పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. పరీక్ష కేంద్రానలు వెతికే పనిలో పడ్డారు.
ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ..
గ్రూప్ -1 లో మొత్తం 503 పోస్టులకు 3,80,202 మం ది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నా రు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా, ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553(15.33శాతం )మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేశారు.
ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలో మొత్తం 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వి.పి గౌతమ్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ పరీక్షను 17,356 మంది రాయనున్నట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. పడబ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రోస్టర్ మెరిట్ ద్వారా ఎంపిక..
- ఈసారి ప్రిలిమ్స్ మార్కుల ఆధారంగానే మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
- గతంలో జనరల్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉండేది. కానీ ప్రస్తుతం రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
- మొత్తం 503 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,150 మందిని ఎంపిక చేయాలి.
- ప్రిలిమ్స్ లో టాప్లో నిలిచిన 25,150 మందిని కాకుండా... రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొదట మొత్తం ఎన్ని ఓపెన్ పోస్టులు ఉంటే, ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో నిలిచిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఆ తర్వాత రిజర్వ్ డ్ పోస్టులకు ఆ కేటగిరీలోని ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున టాప్ లో ఉన్న ఆ కేటగిరీ అభ్యర్థులనే ఎంపిక చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Group 1, JOBS, TSPSC