NYKS RECRUITMENT 2021 NEHRU YUVA KENDRA SANGATHAN RELEASED JOB NOTIFICATION FOR 13206 VOLUNTEER POSTS SS
NYKS Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి 13,206 ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు
NYKS Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి 13,206 ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)
NYKS Recruitment 2021 | టెన్త్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్-NYKS పదవ తరగతి అర్హతతో 13,206 ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు అలర్ట్. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్-NYKS భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ యూత్ కార్ప్స్ స్కీమ్ కోసం దేశవ్యాప్తంగా వాలంటీర్లను నియమిస్తోంది. మొత్తం 13,026 ఖాళీలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది నెహ్రూ యువ కేంద్ర సంఘటన్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 20 చివరి తేదీ. 623 నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కేంద్రాల్లో ఒక్క బ్లాక్‌కు ఇద్దరు చొప్పున వాలంటీర్లను నియమిస్తుంది. ఢిల్లీలో వార్డుకు ఇద్దరు వాలంటీర్లు ఉంటారు. ఇక తెలంగాణలో ప్రతీ రెండు మండలాలకు ఒక వాలంటీర్ ఉంటారు. వీరితో పాటు ప్రతీ కేంద్రంలో కంప్యూటర్, డాక్యుమెంటేషన్ పని కోసం ఇద్దరు వాలంటీర్లు ఉంటారు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో వాలంటీర్లను నియమిస్తోంది నెహ్రూ యువ కేంద్ర సంఘటన్-NYKS. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nyks.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. దరఖాస్తు ఫామ్ ఇదే వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్లోనే ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు.
మొత్తం వాలంటీర్ పోస్టులు- 13,026
విద్యార్హతలు- 10వ తరగతి
గౌరవ వేతనం- రూ.5000
వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 29 ఏళ్లు
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ.
NYKS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 5
దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 20
ఇంటర్వ్యూ- 2021 ఫిబ్రవరి 25 నుంచి 2021 మార్చి 8
ఫలితాల విడుదల- 2021 మార్చి 15
విధుల్లో చేరాల్సిన తేదీ- 2021 ఏప్రిల్ 1
విధుల నిర్వహణ గడువు- 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31
కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ నేషనల్ యూత్ కార్ప్స్ స్కీమ్‌ను నిర్వహిస్తుంది. ఈ స్కీమ్ వ్యవహారాలను స్వయం ప్రతిపత్తిగల సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్-NYKS చూసుకుంటుంది. దేశ నిర్మాణంలో గ్రామీణ యువతను భాగస్వామ్యం చేయడం, యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం లాంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రతీ ఏటా వాలంటీర్ల నియామకం చేపడుతుంది. వాలంటీర్లను ఏడాది కోసమే నియమిస్తుంది కాబట్టి, ఏటేటా వేల సంఖ్యలో వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఒక వాలంటీర్‌కు రెండేళ్ల కన్నా ఎక్కువ పనిచేసేందుకు అవకాశం ఉండదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.