హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Nykaa PRO: మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నైకా ప్రో స్పెషల్ కోర్సు.. ఇలా అప్లై చేసుకోండి

Nykaa PRO: మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నైకా ప్రో స్పెషల్ కోర్సు.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nykaa PRO: మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నైకా. ది ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ పేరుతో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుతం ఉద్యోగాలే (Jobs) లక్ష్యంగా అనేక రకాల కోర్సులను అందిస్తున్నాయి ప్రముఖ సంస్థలు. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా షార్ట్ టర్మ్ కోర్సులతో వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. తాజాగా బ్యూటీ, పర్సనల్ కేర్ (BPC) ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నైకా (Nykaa).. మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. నైకా కంపెనీలో బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు కంటెంట్ & కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన నైకా ప్రో (Nykaa PRO).. ది ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ (The PROfessional Makeup Course) పేరుతో అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్ ఎయిర్‌బ్లాక్ (Airblack) భాగస్వామ్యంతో నైకా ఈ కోర్సును అందిస్తోంది. ది ప్రొఫెషనల్ మేకప్ కోర్సులో భాగంగా మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే వారికి 8 వారాల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ‘ఎయిర్‌బ్లాక్ X నైకా ప్రో’ పేరుతో కోర్సును డెలివరీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న బ్యూటీ ప్రొఫెషనల్స్ నైకా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్ కావచ్చు.

బ్యూటీ ఇండస్ట్రీలో పోటీతత్వం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో.. ఈ కోర్సు ద్వారా బ్యూటీ ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్స్‌కు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు నైకా బీ2బీ బిజినెస్ సీఈవో వికాస్ గుప్తా. బ్యూటీ ప్రొఫెషనల్స్‌ను సరైన దిశలో నడిపిస్తూ వారికి సరికొత్త విషయాలు నేర్పేందుకు ఎయిర్‌బ్లాక్ (Airblack) ప్లాట్ ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. బ్యూటీ ట్రైనింగ్‌లో ఈ ఎడ్యూటెక్ పోర్టల్ ఇప్పటికే టాప్ ప్లేస్‌లో ఉంది.

* కోర్సు ప్రత్యేకతలు

నైకా ప్రో ఎక్స్ ఎయిర్ బ్లాక్ అడ్వాన్స్‌డ్ కోర్సులో (NykaaPRO X Airblack advanced course) భాగంగా 8 వారాల పాటు వెరైటీ ఆఫ్ లుక్స్‌పైన లైవ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో ఫాంటసీ మేకప్, ప్రొస్తెటిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫ్యాషన్ హెచ్‌డీ మేకప్, మ్యారేజ్ మేకప్ ఇండియన్ నుంచి అరేబియన్ వరకు అన్ని రకాల మేకప్ గురించి వివరిస్తారు.

ఇది కూడా చదవండి :  ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ స్టార్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..

ఈ కోర్సు ద్వారా ప్రొఫెషనల్స్‌ తమ ఇన్ స్టా గ్రామ్ పోర్ట్‌ఫోలియోను ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుంటారు. దాంతో పాటు క్లైంట్స్‌ మేనేజ్‌మెంట్ సూత్రాలు, ప్రో వీడియోస్, రీల్స్ చేయడం గురించి నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి నైకా ప్రో, ఎయిర్‌బ్లాక్ బ్యూటీ క్లబ్ మెంబర్‌షిప్స్ సర్టిఫికెట్లు ఇస్తారు.

బ్యూటీ ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్స్ ఈ కోర్సు ద్వారా తమ వ్యాపారాల్లో మరింత అభివృద్ధి చెందుతారని, వారికి మంచి గుర్తింపు లభిస్తుందని వికాస్ గుప్తా చెప్పారు. అంతర్జాతీయ సోషల్ మీడియా ట్రెండ్స్, కంటెంట్‌కు తగ్గట్లు లేటెస్ట్ మేకప్ టెక్నిక్స్, లుక్స్‌కు డిమాండ్ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో నైకా ప్రో కమ్యూనిటీ ద్వారా బ్యూటీ ప్రొఫెషనల్స్ తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని, మార్కెట్‌లో నిలదొక్కుకుంటారని చెప్పారు. మేకప్ ఆర్టిస్ట్‌లు‌గా వారు విజయం సాధిస్తారని వికాస్ వివరించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు