Home /News /jobs /

NXP SEMICONDUCTORS INDIA HAS LAUNCHED A SCHOLARSHIP AND MENTORSHIP PROGRAMME FOR WOMEN IN TECH GH SRD

NXP India: మహిళా గ్రాడ్యుయేట్స్‌ ఈ గుడ్ న్యూస్ మీ కోసమే.. మ్యాటర్ ఏంటంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NXP India: సంవత్సరం పొడవునా మహిళా అభ్యర్థులు సెమీకండక్టర్ పరిశ్రమలో వైవిధ్యం చూపడానికి అనుగుణంగా అవకాశాలను అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
టెక్నాలజీ రంగంలో సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉమెన్ గ్రాడ్యుయేట్స్ కోసం స్పెషల్ స్కాలర్‌షిప్, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌‌కు శ్రీకారం చుట్టింది NXP సెమీకండక్టర్స్ ఇండియా. సెమీకండక్టర్ డిజైన్ పరిశ్రమలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సదరు సంస్థ పేర్కొంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 50 మంది మహిళా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు ప్రత్యేక శిక్షణ అందించాలని ఎన్‌ఎక్స్‌పీ యోచిస్తోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15గా నిర్ణయించారు.

* అర్హత ప్రమాణాలు
ఎన్‌ఎక్స్‌పీలో అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్, ఉద్యోగ అవకాశాలతో పాటు రూ.50,000 రివార్డ్ కూడా అందజేయనున్నారు. గుర్తింపు పొందిన కాలేజీల నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో BE/BTech రెండో సెమిస్టర్‌ పూర్తి చేసి, మూడో సెమిస్టర్‌లోకి ప్రవేశించబోతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సంవత్సరం పొడవునా మహిళా అభ్యర్థులు సెమీకండక్టర్ పరిశ్రమలో వైవిధ్యం చూపడానికి అనుగుణంగా అవకాశాలను అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. సంబంధిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి.. నాలెడ్జ్, సృజనాత్మకతతో భవిష్యత్తును శక్తివంతం చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుందని ఎన్‌ఎక్స్‌పీ సంస్థ తెలిపింది.


ఈ ప్రోగ్రామ్‌ను FutureWiz సహకారంతో డెలివరీ చేయనున్నారు. SoC ఆర్కిటెక్చర్, అనలాగ్ డిజైన్, డిజైన్ ఆర్కిటెక్చర్, వెరిలాగ్/సిస్టమ్ వెరిలాగ్, వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్, RISC-V అండ్ DFT బేసిక్స్‌ వంటి విషయాలపై హైబ్రిడ్ ప్రోగ్రామ్ ఫ్యూచరింగ్ థియరీ, ఇండస్ట్రీ-రిలవెంట్ యూజ్ కేసెస్, ప్రాక్టికల్ క్లాస్‌లను FutureWiz డెలివరీ చేయనుంది.

ఇది కూడా చదవండి : ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. రేపే జాబ్ మేళా

ఈ సందర్భంగా NXP సెమీకండక్టర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లార్స్ రెగర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో టెక్ ఇండస్ట్రీ ఒకటి. అయితే ఈ రంగంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. వ్యాపారాలు వృద్ధి చెందడానికి వైవిధ్యం, ఆవిష్కరణల కోసం సాంకేతిక పరిశ్రమలో మహిళలు అవసరం ఉంది.

వివిధ రోల్స్‌లో మహిళలకు ప్రాతినిధ్యం గణనీయంగా ఉంటే, ఇతర మహిళలను సాంకేతికతలో పనిచేయడానికి ఇది ప్రోత్సహిస్తుంది. పని సంస్కృతిని మెరుగుపరచడమే కాకుండా లాభదాయకత, ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో తమ ఆఫీసుల్లో వైవిధ్యం ఎజెండాను కొంచెం వ్యూహాత్మకంగా తీసుకోవాలని నేను గట్టిగా నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

NXP సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ షెర్రీ అలెగ్జాండర్ మాట్లాడుతూ..‘‘ఇంటర్న్‌షిప్స్ అండ్ మెంటరింగ్ అనేవి బలమైన, విభిన్న ప్రతిభ పైప్‌లైన్‌ను నిర్మించే అద్భుత సాధనాలు. ఇవి రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు, నాలెడ్జ్‌ను విస్తరించడానికి మాత్రమే కాకుండా, NXP సమగ్ర వాతావరణంలో అంతర్దృష్టిని పొందేందుకు కూడా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తాయి. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇంటర్న్‌షిప్‌ ద్వారా ప్రయోజనం పొందుతారు.’’ అని తెలిపారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు