Home /News /jobs /

NVS RECRUITMENT 2021 NAVODAYA VIDYALAYA SAMITI INVITES APPLICATIONS FOR 10 VACANCIES APPLICATION PROCESS ENDS ON DECEMBER 30 SS

NVS Recruitment 2021: హైదరాబాద్‌లోని నవోదయ విద్యాలయ సమితిలో జాబ్స్... లక్ష రూపాయల పైనే వేతనం

NVS Recruitment 2021: హైదరాబాద్‌లోని నవోదయ విద్యాలయ సమితిలో జాబ్స్... లక్ష రూపాయల పైనే వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)

NVS Recruitment 2021: హైదరాబాద్‌లోని నవోదయ విద్యాలయ సమితిలో జాబ్స్... లక్ష రూపాయల పైనే వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

NVS Recruitment 2021 | నవోదయ విద్యాలయ సమితి (NVS) వేర్వేరు రీజియన్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాలు తెలుసుకోండి.

    నవోదయ విద్యాలయ సమితి (NVS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు మూడు రోజుల్లో ముగియనుంది. అకౌంట్స్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ కమిషనర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 30 చివరి తేదీ. హైదరాబాద్‌తో పాటు భోపాల్, చండీగఢ్, జైపూర్, లక్నో, పాట్నా, పూణె, షిల్లాంగ్‌లోని రీజనల్ ఆఫీసుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టుకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

    NVS Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





























    మొత్తం ఖాళీలు10విద్యార్హతలువేతనం
    జనరల్ మేనేజర్ (కన్‌స్ట్రక్షన్)1సివిల్ ఇంజనీరింగ్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ పాస్ కావాలి. సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, ఎగ్జిక్యూషన్‌లో 12 ఏళ్ల అనుభవం ఉండాలి.ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 13వ పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.1,23,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.2,15,900 వేతనం లభిస్తుంది.
    డిప్యూటీ కమిషనర్ (ఫైనాన్స్)1కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉండాలి.ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 12వ పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.78,800 బేసిక్ వేతనంతో మొత్తం రూ.2,09,200 వేతనం లభిస్తుంది.
    అకౌంట్స్ ఆఫీసర్8కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉండాలి.ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 7వ పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది.



    Andhra Pradesh Jobs: విశాఖపట్నంలో ఈఎన్‌టీ ఆస్పత్రిలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    NVS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 30

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    వయస్సు- 2021 డిసెంబర్ 30 నాటికి 56 ఏళ్ల లోపు

    డిప్యుటేషన్- అభ్యర్థులను 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పద్ధతిలో నియమిస్తారు. అవసరాలను బట్టి డిప్యుటేషన్‌ను ఐదేళ్లు పొడిగించొచ్చు.

    జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    India Post Jobs: హైదరాబాద్‌లో రూ.34,800 వేతనంతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు


    NVS Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://navodaya.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 3- లాగిన్ చేసిన తర్వాత విద్యార్హతల వివరాలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

    Step 4- చివరగా వివరాలన్నీ సరిచూసుకొని దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 5- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు