NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... వివరాలివే

NVS Recruitment 2019 | దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా 630 పైగా నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది నవోదయ విద్యాలయ సమితి.

news18-telugu
Updated: July 8, 2019, 11:21 AM IST
NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... వివరాలివే
NVS Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 8, 2019, 11:21 AM IST
నవోదయ విద్యాలయ సమితిలో 2370 ఉద్యోగాలున్నాయి. అసిస్టెంట్ కమిషనర్, పీజీటీ, టీజీటీ, లైబ్రెరియన్, పీఈటీ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది నవోదయ విద్యాలయ సమితి-NVS. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ. పాఠశాల విద్య, అక్షరాస్యత, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా 630 పైగా నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది నవోదయ విద్యాలయ సమితి. ప్రస్తుతం 2370 పోస్టుల్ని ప్రకటించింది. నియామక ప్రక్రియ పూర్తయ్యేసరికి పోస్టులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. వివరాల కోసం navodaya.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NVS Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు: 2370

అసిస్టెంట్ కమిషనర్: 05
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 430
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: 1154


మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్: 564
Loading...
ఫీమేల్ స్టాఫ్ నర్స్: 55
లీగల్ అసిస్టెంట్: 01
కేటరింగ్ అసిస్టెంట్: 26
లోయర్ డివిజన్ క్లర్క్: 135

NVS Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూలై 10
దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 09
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 12
రాతపరీక్ష: 2019 సెప్టెంబర్ 5 - సెప్టెంబర్ 10 మధ్య ఉండొచ్చని అంచనా.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

IIT Jobs: తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు... వివరాలివే

RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే
First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...