NVS Admissions: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

జవహర్​ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి సెలక్షన్ టెస్ట్​ ఓఎంఆర్​ షీట్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం రెండున్నర గంటల పాటు జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను వివిధ సబ్జెక్ట్​ల నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు వస్తాయి.

  • Share this:
Jawahar Navodaya Vidyalaya: దేశంలోని ప్రతిష్టాత్మక జవహర్​ నవోదయ విద్యాసంస్థల్లో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి నవోదయ ఎంట్రన్స్ టెస్ట్​ కోసం విద్యా శాఖ ఆన్​లైన్​ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్​ 31లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.navodaya.gov.in వెబ్​సైట్ ద్వారా ఆన్​లైన్ దరఖాస్తును సమర్పించాలి. అర్హత, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, పరీక్షా విధానం వంటి అన్ని వివరాలను అధికారిక వెబ్​సైట్​లో పొందుపర్చారు. ఈ ఎంట్రన్స్​ టెస్ట్​ను 2022 ఏప్రిల్ 9న నవోదయ విద్యాలయ సమితి నిర్వహించనుంది. ఇది ఆఫ్‌లైన్ పెన్​ అండ్​ పేపర్​ విధానంలో జరగనుంది. 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ -www.navodaya.gov.in లోకి వెళ్లండి. వెబ్‌సైట్‌ డాష్​బోర్డ్​పై "క్లాస్ IX లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–2022”లింక్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయండి. వెంటనే కొత్త రిజిస్ట్రేషన్​ విండో ఓపెన్​ అవుతుంది. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి. ఆ తర్వాత యూజర్​ నేమ్​, పాస్‌వర్డ్‌ క్రియేట్​ చేసుకోండి. ఇప్పుడు మీ లాగిన్ డీటెయిల్స్​తో లాగిన్​ అయ్యి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఈ దరఖాస్తు ఫారమ్ కాపీని డౌన్​లోడ్​ చేసుకోండి.

పరీక్షా విధానం ఇదే..
జవహర్​ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి సెలక్షన్ టెస్ట్​ ఓఎంఆర్​ షీట్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం రెండున్నర గంటల పాటు జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను వివిధ సబ్జెక్ట్​ల నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్ సబ్జెక్ట్​ల నుంచి ఆబ్జెక్టివ్​ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి 8 తరగతి సిలబస్​కు అనుగుణంగానే ఉంటుంది. ప్రశ్నా పత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులు ఎలాంటి విరామం తీసుకునేందుకు వీలుండదు.
Published by:Krishna Adithya
First published: