Home /News /jobs /

NUTRIFYTODAY HAS OFFERED ONLINE CERTIFICATION PROGRAMS FOR WORKING EXECUTIVES TO NUTRACEUTICALS PRODUCTS PRV GH

Nutraceuticals Courses: న్యూట్రాస్యూటికల్స్‌ రంగంలో కొత్త కోర్సు లాంచ్.. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం సర్టిఫికేషన్​ ప్రోగ్రామ్​

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ న్యూట్రిఫైటుడే అకాడమీ న్యూట్రాస్యూటికల్స్‌ ఉత్పత్తులకు సంబంధించిన బ్రిడ్జింగ్ కోర్సులపై ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. వీటిని సెంచూరియన్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

ప్రముఖ ఎడ్‌టెక్ (EdTech)సంస్థ న్యూట్రిఫైటుడే అకాడమీ న్యూట్రాస్యూటికల్స్‌ ఉత్పత్తులకు (Nutraceuticals Products) సంబంధించిన బ్రిడ్జింగ్ కోర్సులపై ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను (Online certification Program) ప్రారంభించింది. వీటిని సెంచూరియన్ యూనివర్సిటీ (Centurion University) నిర్వహిస్తుంది. న్యూట్రాస్యూటికల్స్‌ రంగంలో సరికొత్త వర్క్ పద్ధతిలో ఉద్యోగులను అప్‌గ్రేడ్ చేయాలనుకునే కంపెనీలకు, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు (Working Executive‌) ఈ ప్రోగ్రామ్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. కొత్త సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు సంస్థ అధికారిక వెబ్‌సైట్ academy.nutrifytoday.com ద్వారా అందుబాటులో ఉన్నాయి.

ప్రారంభ డిస్కౌంట్ ఆఫర్..

న్యూ ప్రాడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ కమర్షలైజేషన్, న్యూట్రాస్యూటికల్స్ ఫర్ న్యూట్రిషనిస్ట్స్ అండ్ డైటీషియన్స్ (Nutraceuticals for Nutritionists and Dietitians), OTC మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర ప్రోగ్రామ్‌లపై ప్రారంభ డిస్కౌంట్ ఆఫర్ ఉందని ఎడ్‌టెక్ (EdTech) కంపెనీ తెలిపింది. ఒక్కో కోర్సు ఫీజు రూ.48,000గా నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్స్ ఆరు వారాల నుంచి మూడు నెలల వరకు వేరువేరు సమయాల్లో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా న్యూట్రిఫై టుడే వ్యవస్థాపకుడు అమిత్ శ్రీవాస్తవ (Amit Sri Vastava) మాట్లాడుతూ.. విద్యార్థులు (Students) న్యూట్రిషన్ పరిశ్రమలో (Nutrition industry) అవగాహన పెంచుకోవడానికి ఈ ఎండ్-టు-ఎండ్ ప్రోగ్రామ్‌లను (Programs) ఉపయోగించుకునే అవకాశాన్ని పొందనున్నారని అన్నారు. మొత్తం న్యూట్రాస్యూటికల్స్ బిజినెస్ సప్లై చైన్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం కోసం ఈ కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. 2024 నాటికి కనీసం 5,000 మంది నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నదే అకాడమీ లక్ష్యమని అమిత్ వెల్లడించారు.

మార్కెట్ విలువ  8 బిలియన్ డాలర్లు..

భారతదేశంలో న్యూట్రాస్యూటికల్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. 2025 నాటికి ఈ పరిశ్రమ విలువ 40 బిలియన్ డాలర్లుగా, 2030 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరకుంటుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారని అమిత్ శ్రీవాస్తవ తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగం డిమాండ్‌లను తీర్చడానికి, పనిలో నైపుణ్యం పెంచడం, పరిశ్రమను సజావుగా విస్తరించేలా చేయడానికి న్యూట్రిఫైటుడే కృషి చేస్తుందన్నారు.

అకాడమీ ఫ్యాకల్టీ మెంబర్లుగా సీనియర్ పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు ఉన్నారు. ఈ రంగంపై అంతర్గత విశ్లేషణలను వీరు అందించనున్నారని న్యూట్రిఫైటుడే సంస్థ ప్రకటించింది. మంబై, బెంగళూరు కేంద్రంగా ఈ అకాడమీ న్యూట్రాస్యూటికల్ రంగంలోని నిపుణుల నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించనుంది. ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రాస్యూటికల్స్‌లో కెరీర్‌ను కొనసాగించాలని కోరుకునే వారి కోసమే ఈ అకాడమీని ఏర్పాటు చేశారు.

విద్యార్థుల కెరీర్‌ను తీర్చిదిద్దమే లక్ష్యమని..

మరో సంస్థ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (XLRI) జంషెడ్‌పూర్, ఫైనాన్స్‌‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌(PGDF)ను ప్రారంభించనుంది. వేగంగా మారుతున్న ఫైనాన్స్ రంగంలో విద్యార్థుల కెరీర్‌ను తీర్చిదిద్దమే లక్ష్యమని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఫైనాన్స్, మేనేజిరియల్ నైపుణ్యాలతో కెరీర్‌ను డెవలప్ చేసుకోవడంపై ఆసక్తి ఉన్న నిపుణులకు ఈ ప్రోగ్రామ్ సరిపొతుందని సంస్థ పేర్కొంది.

ఫైనాన్స్‌పై సమ్మర్ ఇంటర్న్‌షిప్, పరిశ్రమ లీడర్ల వర్క్‌షాప్ సెషన్‌లు, క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్, అనుకరణ-ఆధారిత ట్రేడింగ్‌తో పాటు వాల్యుయేషన్ మాడ్యూల్స్‌లలో 32 ఫౌండేషన్ అధునాతన స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఫిన్‌టెక్, డిజిటల్ ఫైనాన్స్, డేటా సైన్స్, ఫైనాన్స్‌కు వర్తించే మెషీన్ లెర్నింగ్ టూల్స్ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పిస్తామని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, జంషెడ్‌పూర్ వెల్లడించింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: College student, New course, Online course, University

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు