టెన్త్ చదువుతున్న బాలికలకు ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థులను స్కాలర్ షిప్ (Scholarship) అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటన విడుదల చేశారు. NTR Trust Gest 2023 కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. www.ntrtrust.org వెబ్ సైట్లో 11.11.2022 తేదీ నుంచి 30.11.2022 వరకు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఎనిమిదేళ్లగా ఎన్టీఆర్ విద్యాసంస్థలు ప్రతిష్టాత్మకంగా జీఈఎస్‌టీని (Girls Education Scholarship Test (GEST-2023) నిర్వహిస్తున్నారు. నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీఈఎస్‌టీ-2023 ని ఈ ఏడాది డిసెంబరు 4న పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలియచేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకారవేతనం అందించనున్నట్లు వివరించారు.
మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు.. తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు స్కాలర్ షిప్ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఇతర పూర్తి వివరాలకు 7660002627, 7660002628 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, NTR, Scholarships