నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ntpc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 నవంబర్ 2022. ఈ పోస్టులను గేట్ 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య – 864
ఎలక్ట్రికల్ ఇంజనీర్ - 280
మెకానికల్ ఇంజనీర్ - 360
ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ - 164
సివిల్ ఇంజనీర్ - 30
మైనింగ్ ఇంజనీర్ - 30
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - అక్టోబర్ 28
దరఖాస్తుకు చివరి తేదీ - నవంబర్ 11
దరఖాస్తు ఫీజు..
అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 300. అయితే, SC, ST, PWD కేటగిరీల అభ్యర్థులు మరియు అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
విద్యార్హతలు..
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపాలి.
వయోపరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుండి రూ. 1,40,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in ని సందర్శించండి.
-ఇప్పుడు అభ్యర్థి హోమ్‌పేజీలో ఇవ్వబడిన ఉద్యోగాల విభాగంపై క్లిక్ చేయండి.
-తదుపరి సంబంధిత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
-ఆ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
-ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
-ఆ తర్వాత ఫారమ్‌ను సమర్పించండి.
-చివరగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NTPC