ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NTPC) నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. 50 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ETT) ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీగా మే 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే గేట్-2021 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఖాళీల విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో 22, మెకానికల్ లో 14, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లో 14 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీలో తప్పనిసరిగా 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్, సెమిస్టర్ లో ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 27 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు దరఖాస్తుకు అనర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Official Website - Direct Link
Online Application - Direct Link
ఎలా అప్లై చేయాలంటే..
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ntpccareers.net లో మే 6లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గేట్ 2021లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా షర్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించిన అనంతరం ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NTPC