NTPC Recruitment 2021 | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. కమర్షియల్ ఫంక్షన్, కన్సల్టెన్సీ వింగ్, బిజినెస్ అనాలసిస్, సోలార్ పీవీ, కార్పొరేట్ కమ్యూనికేషన్, క్లీన్ టెక్నాలజీస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ప్రతీ పోస్టుకు విద్యార్హతలతో పాటు అనుభవం తప్పనిసరి. ప్రతీ పోస్టుకు అర్హతలు, అనుభవం వేర్వేరుగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ntpc.co.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
NTPC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 22
ఎగ్జిక్యూటీవ్ (కమర్షియల్)- 14
ఎగ్జిక్యూటీవ్ (కన్సల్టెన్సీ)- 3
ఎగ్జిక్యూటీవ్ (బిజినెస్ అనలిస్ట్)- 1
ఎగ్జిక్యూటీవ్ (క్లీన్ టెక్నాలజీస్)- 1
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోలార్)- 1
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (కంపెనీ సెక్రెటరీ)- 1
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్)- 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 6
విద్యార్హతలు- ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ లాంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేయొచ్చు.
వయస్సు- ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు 35 ఏళ్లు, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు 56 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
అభ్యర్థులు https://www.ntpc.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
కెరీర్స్ సెక్షన్లో ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.