NTPC Jobs: ఎన్‌టీపీసీలో 275 ఉద్యోగాలు... బీటెక్ అర్హత

NTPC Recruitment 2020 | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 275 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 16, 2020, 11:54 AM IST
NTPC Jobs: ఎన్‌టీపీసీలో 275 ఉద్యోగాలు... బీటెక్ అర్హత
NTPC Jobs: ఎన్‌టీపీసీలో 275 ఉద్యోగాలు... బీటెక్ అర్హత (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 275 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ntpccareers.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 147 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Jobs: కోల్‌ఫీల్డ్స్‌లో 495 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NTPC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం ఖాళీలు- 275
ఇంజనీర్- 250
అసిస్టెంట్ కెమిస్ట్- 25దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 31
విద్యార్హత- ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుకు కెమిస్ట్రీలో ఎంఎస్సీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
అనుభవం- మూడేళ్లు అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: July 16, 2020, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading