NTPC Jobs: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

NTPC Recruitment 2020 | ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 21, 2020, 1:28 PM IST
NTPC Jobs: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
NTPC Jobs: ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60 ఖాళీలను ప్రకటించింది. ఎన్‌టీపీసీకి చెందిన ప్రాజెక్టులు, స్టేషన్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 సెప్టెంబర్ 2 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://ntpccareers.net/ వెబ్‌సైట్‌ చూడండి.

Jobs: గుడ్ న్యూస్... స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాలు

IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

NTPC Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం ఖాళీలు- 60
మెడికల్ స్పెషలిస్ట్- 23 (మెడిసిన్-12, ఓ&జీ- 5, పీడియాట్రిక్స్- 6)
మెడికల్ ఆఫీసర్- 37దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 2
విద్యార్హత- మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంబీబీఎస్ పాస్ కావాలి.
అనుభవం- మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు ఏడాది అనుభవం, మెడికల్ ఆఫీసర్ పోస్టుకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు- 37 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ. మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు- రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళలకు ఫీజు లేదు.
Published by: Santhosh Kumar S
First published: August 21, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading