NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి.

news18-telugu
Updated: October 14, 2019, 11:39 AM IST
NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే
NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NTPC Recruitment 2019-20: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...



పోస్ట్ పేరు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్
దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 10
దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 31
విద్యార్హత: బీఈ లేదా బీటెక్. గేట్ 2020 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డిప్లొమా, బీటెక్ పాసయ్యారా? డీఆర్‌డీఓలో ఉద్యోగాలు

UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్... వివరాలివే

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: October 14, 2019, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading