ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC CBT 2 -2022 పరీక్షకు సంబంధించిన సిటీ స్లిప్‌ను అధికారిక వెబ్‌సైట్rrbcdg.gov.inలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో బోర్డు అడ్మిట్ కార్డును(Admit Cards) సైతం త్వరలోనే విడుదల చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అడ్మిట్ కార్డ్ మే 5 న విడుదలయ్యే అవకాశం ఉంది. NTPC రెండో దశ పరీక్షలను మే 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు బోర్డు(Board) ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా 4, 6 లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అదేవిధంగా పే లెవల్స్ 2, 3, 5 స్థాయి ఉద్యోగాల కోసం పరీక్ష షెడ్యూల్‌ను(Schedule) రెండో దశ పరీక్షల తరువాత ప్రకటించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ(RRB) పేర్కొంది. CBT 1 షార్ట్‌లిస్ట్ అభ్యర్థులు మాత్రమే CBT 2కి హాజరు కావడానికి అనుమతి ఇవ్వనుంది. కాగా, CBT 1 పరీక్ష డిసెంబర్ 28, 2020 నుండి జూలై 31, 2021 వరకు జరిగింది. CBT-1 ఫలితాలను మార్చి 30- ఏప్రిల్ 1, 2022 మధ్య అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు.
ఆర్‌ఆర్‌బీ ఏప్రిల్ 26న NTPC CBT 2 - 2022 పరీక్ష కోసం పరీక్ష సిటీ కేంద్రాన్ని తనిఖీ చేయడానికి లింక్‌ను యాక్టివేట్ చేసింది. అయితే, సిటీ సెంటర్ జాబితా ముగిసిన వెంటనే చాలా మంది దరఖాస్తుదారులు పక్క రాష్ట్రాల్లో CBT 2 పరీక్ష నగరాన్ని కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మరికొందరు తమకు కేటాయించిన కేంద్రాలు తమ సొంత రాష్ట్రానికి దూరంగా ఉన్నందున పరీక్షలకు హాజరయ్యే అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు.
దీంతో చాలా మంది అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా నిరసన గళం విప్పారు. పరీక్ష కేంద్రాలను మార్చాలని ఆర్‌ఆర్‌బీని కోరారు. కోల్‌కతా జోన్ నుండి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పరీక్ష సిటీగా కేటాయించారు. కర్ణాటక జోన్‌కు చెందిన వారికి మహారాష్ట్రలోని అమరావతిలో సీబీటీ 2 పరీక్షా కేంద్రాన్ని కేటాయించారని పలువురు అభ్యర్థులు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
* NTPC CBT 2- పరీక్ష విధానం
పరీక్ష రాయడానికి అభ్యర్థులకు 90 నిమిషాల సమయం కేటాయించనున్నారు. మొత్తంగా 120 ప్రశ్నలు అడగనున్నారు. అందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50, గణితం నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుండి 35 ప్రశ్నలు ఉండనున్నాయి. PwBD అభ్యర్థులకు పరీక్ష రాయడానికి 120 నిమిషాల సమయం కేటాయించనున్నారు. PwBD అభ్యర్థుల తరఫున వారి వెంట వచ్చిన వ్యక్తి పరీక్ష రాయనున్నారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్‌తో ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉండనున్నాయి.
* అర్హత మార్కులు
పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో కనీస మార్కుల శాతం సాధించాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. EWS అభ్యర్థులు 40 శాతం, OBC (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు, ఎస్సీ అభ్యర్థులు 30 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 25 శాతం మార్కులు సాధించాలి. పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు రిజర్వ్ చేసిన ఖాళీల్లో అభ్యర్థుల కొరత ఏర్పడినప్పుడు అర్హత కోసం ఈ మార్కుల శాతాలను 2 శాతం సడలించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admit cards, Bank Jobs, Rrb ntpc