హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC: త్వరలో ఎన్‌టీపీసీ సీబీటీ-2 పరీక్ష.. సెలబస్, పరీక్ష విధానం!

RRB NTPC: త్వరలో ఎన్‌టీపీసీ సీబీటీ-2 పరీక్ష.. సెలబస్, పరీక్ష విధానం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

RRB NTP 2022 | ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-2కు సంబంధించి లెవల్-4, లెవెల్-6 పరీక్షలు మే 9, 2022, మే 10, 2022 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష సెల‌బ‌స్ అండ్ ఎక్జామ్ ప్యాట‌ర్న్ వివ‌రాలు..

ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ-2కు సంబంధించి లెవల్-4, లెవెల్-6 పరీక్షలు మే 9, 2022, మే 10, 2022 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. నోటిఫికేష‌న్ కోసం తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అధికారిక వెబ్‌సైట్ https://rrbsecunderabad.gov.in/ ను సంద‌ర్శంచ‌వ‌చ్చు. ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ–2లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్​ కూడా ఉంటుంది. జనరల్ అవేర్​నెస్​ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథ్స్​ నుంచి 35 ప్రశ్నలు, జనరల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ రీజనింగ్​ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు 90 నిమిషాల సమయంలో పరీక్షను పూర్తి చేయాలి.

AP Inter Exams: ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. తుపాను కార‌ణంగా ప‌రీక్ష వాయిదా.. తిరిగి ఎప్పుడంటే?


సీబీటీ–2 సిలబస్

- మ్యాథ్స్​ సెక్షన్​ నుంచి నంబర్ సిస్టమ్స్, దశాంశాలు, భిన్నాలు, LCM, HCF, నిష్పత్తి, శాతాలు, మెన్సురేషన్, టైమ్​ అండ్​ వర్క్​, టైమ్​ అండ్​ డిస్టెన్స్​, సింపుల్​ అండ్​ కాంపోండ్ ఇంట్రెస్ట్​, ప్రాఫిట్ అండ్​ లాస్​, ఎలిమెంటరీ ఆల్​జీబ్రా, జామెట్రీ వంటి టాపిక్స్​ నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్​ రీజనింగ్​ సెక్షన్​ నుంచి అనాలజీస్, అనలిటికల్​.

Big Breaking: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపటి పరీక్ష వాయిదా.. కొత్త డేట్ ఇదే..!


రీజనింగ్​, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్, డేటా సఫీషియన్సీ, నంబర్​ అండ్​ ఆల్ఫాబెటిక్​ సిరీస్​, కోడింగ్ అండ్​ డీకోడింగ్​, మ్యాథమెటికల్ ఆపరేషన్స్​, సిమిలారిటీస్​ అండ్​ డిఫరెన్సెస్​, రిలేషన్​షిప్స్​, స్టేట్​మెంట్ కన్​క్లూజన్​, స్టేట్​మెంట్ కోర్సెస్​ ఆఫ్​ యాక్షన్​, డెసిజన్​ మేకింగ్, మ్యాప్స్​, ఇంటర్​ప్రిటేషన్​ ఆఫ్​ గ్రాఫ్స్​ మొదలైన టాపిక్స్​ నుంచి ప్రశ్నలొస్తాయి.

Career and Courses: జాబ్ ట్ర‌య‌ల్స్ చేసేవారికి బెస్ట్ చాయిస్స్‌.. ఉచితంగా కెరీర్ కోర్సులు

జనరల్​ స్టడీస్​ సెక్షన్​ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, క్రీడలు, కళ & సంస్కృతి, సాహిత్యం, స్మారక చిహ్నం, భారతదేశంలోని ప్రదేశాలు, జనరల్​ సైన్స్​, చరిత్ర, భౌగోళికం, పాలిటీ గవర్నెన్స్, సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్, ఎకానమీ టాపిక్స్​ నుంచి ప్రశ్నలొస్తాయి.

First published:

Tags: Indian Railways, Rrb ntpc

ఉత్తమ కథలు