Home /News /jobs /

NTA WILL SOON START THE ONLINE REGISTRATION PROCESS FOR THE CUCET 2022 HERE DETAILS NS

CUCET 2022: సెంట్రల్ యూనివర్సిటీల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు అలర్ట్.. త్వరలోనే CUCET నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ సారి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ఇందుకు సంబంధించిన నోటఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా? అయితే.. మీకు శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CUCET 2022) నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఎగ్జామ్ ద్వారా 41 సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు నిర్వహించనున్నారు. గతంలో 12వ తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లను నిర్వహించేవారు. అయితే ఈ సారి మాత్రం సెంట్రల్ యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు కామన్ అప్టిట్యూడ్ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిపాదన కొన్ని సంవత్సరాల నుంచి ఉండగా.. ఈ ఏడాది కార్యరూపం దాల్చనుంది. ఆ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లను నిర్వహించనున్నారు.

    ఈ ఎగ్జామ్ ఆధారంగా తెలంగాణ, ఏపీలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ, ఉర్దూ, అనంతపురంలోని ఏపీ యూనివర్సిటీల్లో 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఈసీయూసెట్ ను జూన్ లేదా జులైలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భావిస్తోంది. దీంతో ఈ నేలలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదికి ఇంగ్లిష్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ తదితర 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
    UPSC EXAMS: యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? ప్రిపరేషన్‌లో మీకు హెల్ప్ అయ్యే బుక్స్, ప్లానింగ్ ఇవే..

    ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందంటే..
    త్వరలో నిర్వహించనున్న సీయూసెట్ లో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన పేపర్ తో పాటు ఇంగ్లిష్, జనరల్ అవేర్ నెస్, రీజనింగ్ తదితర సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉండనున్నాయి. కామన్ ఆప్టిట్యూడ్ కు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 60 నిమిషాలు కేటాయిస్తారని సమాచారం. సబ్జెక్టుకు సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానం ఇవ్వడానికి 120 నిమిషాల సమయం ఉంటుందని తెలుస్తోంది. నెగటివ్ మార్కులు కూడా ఉంటాయని తెలుస్తుంది.
    Degree Students: డిగ్రీ పూర్తి చేశారా.. అయితే నెలకు రూ.10 వేలు పొందొచ్చు.. దరఖాస్తు, ఎంపిక విధానం ఇలా..

    ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ నెలలో ఉండే అవకాశం ఉంది..
    -అప్లికేషన్లు ప్రారంభం-మార్చి/ఏప్రిల్
    -అప్లికేషన్లకు చివరి తేదీ: మే
    -అప్లికేషన్ల కరెక్షన్ కు ఆఖరి తేదీ: మే
    -అడ్మిట్ కార్డులు విడుదల: జూన్
    -ఎగ్జామ్: జూన్
    -ఆన్సర్ కీ: జూన్
    -ఫలితాలు: జులై
    -మెరిట్ లిస్ట్: జులై
    -కౌన్సెలింగ్: ఆగస్టు
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exams, National Testing Agency

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు